ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra లో మధ్యంతర ఎన్నికలు పెట్టాలి: మాజీ సీఎం Uddhav Thackeray

ABN, First Publish Date - 2022-07-09T01:40:58+05:30

మహారాష్ట్ర(Maharashtra)లో మధ్యంతర ఎన్నికలు(Mid Term Elections) నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(Shivasena) అధినేత ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహారాష్ట్ర(Maharashtra)లో మధ్యంతర ఎన్నికలు(Mid Term Elections) నిర్వహించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(Shivasena) అధినేత ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackeray) డిమాండ్ చేశారు. రెబల్ నేతలను శివసేన ఎన్నికల గుర్తు(Election Symbol)ని వాడుకోనివ్వబోమని  అన్నారు. ఈ మేరకు ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ ఈ రోజే ఎన్నికలు పెట్టాలని వాళ్లకు(రెబల్ వర్గం) నేను సవాలు చేస్తున్నా. తప్పు చేసుంటే ప్రజలే మమ్మల్ని ఇంటికి సాగనంపుతారు. రెండున్నరేళ్ల క్రితమే మీరు చేయాల్సిన పని ఇది. అప్పుడే చేసుంటే గౌరవప్రదంగా ఉండేది. ఇదంతా జరిగివుండేది కాదు కదా’’ అని ఉద్ధవ్ థాక్రే అన్నారు.


శివసేన నుంచి విల్లు, బాణం గుర్తుని ఎవరూ లాక్కోలేరు. ప్రజలు కేవలం సింబల్‌ని మాత్రమే చూస్తారనుకుంటే పొరపాటు.. సింబల్‌ని దక్కించుకున్న వ్యక్తి ఎవరో కూడా చూస్తారని ఉద్ధవ్ హెచ్చరించారు. గత రెండున్నరేళ్లుగా తనని, తన కుటుంబాన్ని బీజేపీ(BJP) తీవ్రంగా దుయ్యబట్టినా రెబల్ నేతలు ఎందుకు నిశబ్ధాన్ని పాటించారని ప్రశ్నించారు. ‘‘ ఎందుకంటే మీరంతా వాళ్లతో(బీజేపీ) ఉన్నారు. సొంత పార్టీని మోసం చేశారు’’ అని షిండే పేరుని ప్రస్తావించకుండానే ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. 


‘‘ కొంతమందిని పిలవగానే మాతోశ్రీ(ఉద్ధవ్ నివాసం)కి వస్తారు. నా పట్ల గౌరవం ఉందని చెబుతారు. నేను కృతజ్ఞతలు తెలుపుతాను. కానీ వచ్చినప్పుడే నాతో మాట్లాడివుంటే మీరంతా ఇప్పుడు టూర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. నా కుటుంబానికి దూషించిన వారితో మీరంతా ఉన్నారు. అంతా కలిసి నా ప్రతిష్ట మీద దాడులు చేశారు. మీ ప్రేమ, గౌరవం నిజమైనదో కాదో మీరే తేల్చుకోండి. బెదిరింపులు వచ్చినా నాతోపాటు ఉన్న 15-16 ఎమ్మెల్యేల పట్ల గర్వంగా ఉంది. ఈ దేశం సత్యమేవ జయతేపై నిలిచింది. అసత్యమేవ జయతేపై కాదు ’’ అని ఉద్ధవ్ థాక్రే అన్నారు. ‘‘ వాళ్లు(బీజేపీ) నా కొడుకుని తుదముట్టించాలనుకున్నారు. కానీ మీరంతా వారి పక్కన కూర్చుని సంతోషాలను పంచుకుంటున్నారు’’ అని రెబల్ ఎమ్మెల్యేలను విమర్శించారు.

Updated Date - 2022-07-09T01:40:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising