ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే...

ABN, First Publish Date - 2022-05-31T14:07:18+05:30

డీఎంకే యువజన విభాగం నాయకుడు, చేపాక్‌-ట్రిప్లికేన్‌ ఎమ్మెల్యే ఉదయనిధికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ సోమవారం ఉదయం పాఠశాలల విద్యాశాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - తిరుచ్చి జిల్లా నేతల తీర్మానం


చెన్నై: డీఎంకే యువజన విభాగం నాయకుడు, చేపాక్‌-ట్రిప్లికేన్‌ ఎమ్మెల్యే ఉదయనిధికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ సోమవారం ఉదయం పాఠశాలల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి అధ్యక్షతన జరిగిన తిరుచ్చి సౌత్‌ జిల్లా నిర్వాహకుల సమావేశంలో ఓ తీర్మానం ప్రతిపాదించి ఆమోదించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా భారీ యెత్తున నిర్వహించేందుకు చేపట్టాల్సి చర్యలపై చర్చించేందుకు ఈ సమావేశం తిరుచ్చిలోని డీఎంకే కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అన్బిల్‌ మహేశ్‌ మాట్లాడుతూ లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో  డీఎంకే కూటమి ఘనవిజయం సాధించేందుకు ఉదయినిధి ప్రచారం బాగా తోడ్పడిందని, అతని సేవలను గుర్తించి మంత్రి పదవిని ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నారు. ఇదే విధంగా పలువురు సీనియర్‌ మంత్రులు కూడా ఉదయనిధికి మంత్రిపదవి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని చెప్పారు. ఆ తర్వాత సమావేశంలో ఉదయనిధికి మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టగా సమావేశంలో పాల్గొన్న  వారంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఇన్రికో ఇదయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-31T14:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising