ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కావాలంటే నా కారు ఇస్తా...

ABN, First Publish Date - 2022-04-22T13:30:54+05:30

డీఎంకే యువనేత, ట్రిప్లికేన్‌ ఎమ్మెల్యే ఉదయనిధి గురువారం అసెంబ్లీలో నవ్వులు పూయించారు. అన్నాడీఎంకే నేతలకు చురకలంటిస్తూ ఉదయనిధి మాట్లాడగా.. ఆయనకు ధీటుగా ఓపీఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కమలాలయానికి మాత్రం వెళ్లొద్దు

- అన్నాడీఎంకే నేతలకు ఉదయనిధి చురకలు

- అవసరమైతే మీ కారు తీసుకుంటాం

- కానీ అన్నాడీఎంకే కార్యాలయానికే వెళ్తాం

- ఓపీఎస్‌ విసుర్లు


ప్యారీస్‌(చెన్నై): డీఎంకే యువనేత, ట్రిప్లికేన్‌ ఎమ్మెల్యే ఉదయనిధి గురువారం అసెంబ్లీలో నవ్వులు పూయించారు. అన్నాడీఎంకే నేతలకు చురకలంటిస్తూ ఉదయనిధి మాట్లాడగా.. ఆయనకు ధీటుగా ఓపీఎస్‌ విసుర్లతో స్పందించారు. అసెంబ్లీలో సామాజిక సంక్షేమం, దివ్యాంగుల బిల్లుపై సాగిన చర్చలో ప్రతిపక్షనేతలు ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ఉదయనిధి కూడా మాట్లాడారు. ముందుగా సీఎం, స్పీకర్‌, ప్రతిపక్షనేత, ప్రతిపక్ష ఉపనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది తాను అసెంబ్లీలో మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్షాలు వాకౌట్‌ చేశాయని, ప్రస్తుతం సభలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేయనందుకే వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఎప్పుడైనా వాకౌట్‌ చేస్తే అవసరమైతే నా కారు తీసుకెళ్లండి. కానీ కానీ కమలాలయానికి మాత్రం వెళ్లొద్దు’’ అంటూ చలోక్తి విసిరారు. దాంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. డీఎంకే సభ్యుల బల్లలు చరుస్తూ  సంతోషం వ్యక్తపరిచారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఉపనేత ఒ.పన్నీర్‌సెల్వం స్పందిస్తూ.. ‘‘అవసరమైతే మీ కారు తీసుకున్నా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి మాత్రమే వెళ్తామే తప్ప, మరో వైపుకు వెళ్లే ఉద్దేశం లేదు’’ అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 


అసెంబ్లీకొచ్చిన స్టాలిన్‌ కుటుంబం

సీఎం తనయుడు, ట్రిప్లికేన్‌ ఎమ్మెల్యే ఉదయనిధి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు గురువారం స్టాలిన్‌ కుటుంబం అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానమిచ్చారు ఆ తరువాత సీఎం స్టాలిన్‌ 110వ నిబంధన కింద ప్రకటన చేశారు. అనంతరం ప్రతిపక్షనేతలు, ఉదయనిధి మాట్లాడారు. ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టాలిన్‌ సతీమణి దుర్గ, కుమార్తె సెందామరై, కోడలు కృత్తికా, మనవడు నలన్‌ తదితరులు వచ్చారు. వారు అసెంబ్లీ ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొని సభా కార్యక్రమాలను ఆసక్తిగా చూశారు.

Updated Date - 2022-04-22T13:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising