ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Borewellలో పడిన బాలుడు...రక్షించిన అధికారులు

ABN, First Publish Date - 2022-06-08T17:01:37+05:30

ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడిని అధికారులు రక్షించిన ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడిని అధికారులు రక్షించిన ఉదంతం గుజరాత్ రాష్ట్రంలో వెలుగు చూసింది. సురేంద్రనగర్ జిల్లాలో కూలీ కుటుంబానికి చెందిన శివం అనే రెండేళ్ల బాలుడు మంగళవారం రాత్రి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పొలంలోని బోరుబావిలో పడ్డాడు.వెంటనే ఆర్మీ, అగ్నిమాపక దళం, పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని రక్షించినట్లు అధికారులు తెలిపారు.బోరుబావిలో పడి 20-25 అడుగుల లోతులో చిక్కుకున్నాడని పరిపాలన అధికారి ఎంపీ పటేల్ విలేకరులకు తెలిపారు.జిల్లా పరిపాలన అధికారులు విషయం తెలుసుకున్న వెంటనే, వారు స్థానిక డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్‌తో పాటు అహ్మదాబాద్‌లోని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బృందాన్ని అప్రమత్తం చేశారు.


స్థానిక యంత్రాంగం ఆర్మీ, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, పోలీసుల సహాయాన్ని కూడా కోరింది.ఆర్మీ, పోలీసులు, జిల్లా పరిపాలన సిబ్బంది, గ్రామస్థులతో కూడిన బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారు సమన్వయంతో పనిచేసి మంగళవారం రాత్రి 10.45 గంటలకు చిన్నారిని బోరుబావిలో నుంచి బయటకు తీశారని అధికారి తెలిపారు.బాలుడిని ధృంగాద్ర పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి నుంచి తదుపరి చికిత్స కోసం జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించామని, చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.ఆర్మీ, పోలీసులు, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత 40 నిమిషాల్లోనే రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది.

Updated Date - 2022-06-08T17:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising