ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi airportలో ఇద్దరు ఉగండా మహిళల అరెస్ట్..cocaine capsules స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-28T13:14:03+05:30

కొకైన్ క్యాప్సూల్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ఉగాండా దేశ మహిళలను ఢిల్లీలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొకైన్ క్యాప్సూల్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ఉగాండా దేశ మహిళలను ఢిల్లీలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కడుపులో దాచుకున్న 181 కొకైన్ క్యాప్సూల్స్‌తో ఇద్దరు విదేశీ మహిళలను అరెస్టు చేశారు. వారిద్దరూ కొకైన్‌తో కూడిన క్యాప్సూల్స్‌ దాచుకొని వచ్చారని కస్టమ్స్ అధికారులు చెప్పారు. కొకైన్ క్యాప్సూల్స్‌ మార్కెట్ విలువ రూ.28 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.ప్రయాణీకులిద్దరూ ఉగాండాకు చెందినవారని, ఒకరికొకరు సంబంధం లేదని దర్యాప్తులో తేలింది. ఆదివారం అదే విమానంలో అడిస్‌ అబాబా నుంచి వారు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు.ఉగండా నుంచి ఢిల్లీకి వచ్చిన ఇద్దరు మహిళల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారిని ప్రశ్నించగా కడుపులో 181 కొకైన్ క్యాప్పూల్స్ దొరికాయి.


మహిళలను ఆసుపత్రికి తరలించి పొత్తికడుపు ఎక్స్ రే తీయగా వారి కడుపులో కొకైన్ క్యాప్సూల్స్ ఉన్నాయని తేలింది.ఉగండా దేశం నుంచి కొకైన్ క్యాప్సూల్స్ స్మగ్లింగ్ బాగోతాన్ని ఎవరు నడుపుతున్నారు? ఎక్కడి నుంచి నడుపుతున్నారు? ఈ కొకైన్ ను ఎవరికి డెలివరీ చేస్తారనే విషయాలపై కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. 

Updated Date - 2022-05-28T13:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising