ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtraలో విరిగిపడిన కొండచరియలు...సహాయచర్యలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-13T18:19:57+05:30

కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని వసాయ్‌లో (Maharashtras Vasai) బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని వసాయ్‌లో (Maharashtras Vasai) బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు.వాసాయిలోని వాగ్రపాడు ప్రాంతంలోని ఓ ఇంటిపై కొండచరియల శిథిలాలు పడ్డాయి.రెస్క్యూ అధికారులు సైట్ నుంచి నలుగురిని రక్షించారు.మరో ఇద్దరు ఇప్పటికీ శిధిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ముంబయి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వసాయ్‌లో కొండచరియలు విరిగిపడడం ఇదే తొలిసారి కాదు. 


మంగళవారం నాగ్‌పూర్ జిల్లాలో భారీవర్షాల వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు. వరదనీరు ప్రవహిస్తున్న వంతెనను దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోవడంతో చాలా మంది గల్లంతయ్యారు.ముంబై, థానే, రాయ్‌గఢ్‌, పాల్‌ఘర్‌లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారత వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మహారాష్ట్ర వర్షాల బీభత్సం మధ్య మృతుల సంఖ్య పెరిగింది.  మహారాష్ట్రలో 83,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని మూడు నదులు వరద హెచ్చరిక స్థాయిలను మించి ప్రవహిస్తున్నాయి.


Updated Date - 2022-07-13T18:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising