ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Durga Puja: దుర్గాపూజ మండపంలో అపశ్రుతి...అగ్నిప్రమాదంలో ఇద్దరి మృతి, 60మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-10-03T12:47:19+05:30

Durga Puja: దుర్గాపూజ మండపంలో అపశ్రుతి...అగ్నిప్రమాదంలో ఇద్దరి మృతి, 60మందికి గాయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భదోహి(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భదోహి(Uttar Pradesh’s Bhadohi) పట్టణంలో దుర్గా పూజ పండల్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి దుర్గా పూజ మండపంలో జరిగిన అగ్నిప్రమాదంలో(Durga Puja pandal fire) ఇద్దరు మరణించగా, మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఔరాయి పోలీసుస్టేషన్ పరిధిలోని దుర్గాపూజ మండపంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా మెజిస్ట్రేట్ గౌరంగ్ రాఠీ చెప్పారు. జిల్లా మెజిస్ట్రేటుతో పాటు అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చిన సహాయ పనులు(rescue efforts) చేపట్టారు. 


ఈ అగ్నిప్రమాదంలో 33 మంది తీవ్రంగా గాయపడటంతో వారిని వరణాసి ఆసుపత్రికి తరలించారు. మరో 9మందిని స్థానిక భదోహి ఆసుపత్రిలో చేర్చారు.ఆదివారం రాత్రి హారతి సందర్భంగా అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్(short circuit) వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. దుర్గా పూజ మండపంలో అగ్నిప్రమాదం జరిగినపుడు 300 మంది భక్తులు లోపల ఉన్నారని అధికారులు చెప్పారు. 

Updated Date - 2022-10-03T12:47:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising