ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Norway నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి, పలువురికి బుల్లెట్ గాయాలు

ABN, First Publish Date - 2022-06-25T12:36:56+05:30

నార్వే రాజధాని ఓస్లో నగరంలోని నైట్‌క్లబ్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓస్లో (నార్వే): నార్వే రాజధాని ఓస్లో నగరంలోని నైట్‌క్లబ్‌లో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ కాల్పుల్లో నైట్ క్లబ్‌లో ఉన్న మరో 10 మంది గాయపడినట్లు నార్వే పోలీసులు తెలిపారు.ఓస్లో నగరం మధ్యలో ఉన్న ప్రముఖ గే బార్, నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిపినట్లు నార్వే అధికారులు చెప్పారు. క్లబ్ సమీపంలో ఒక అనుమానితుడిని పట్టుకున్నట్లు నార్వే పోలీసులు తెలిపారు. దాడికి గల కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు.ఓస్లో తన వార్షిక ప్రైడ్ పరేడ్‌ను శనివారం తర్వాత నిర్వహించనుంది.‘‘నైట్ క్లబ్ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు’’ అని ఓస్లో నగర పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ట్వీట్‌లో తెలిపింది.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాల్పుల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించామని ఓస్లో యూనివర్సిటీ ఆస్పత్రి తెలిపింది.


Updated Date - 2022-06-25T12:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising