ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Japan భూకంపం ఎఫెక్ట్...నలుగురి మృతి, 90మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-03-17T13:03:58+05:30

తూర్పు జపాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: తూర్పు జపాన్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు. ఈ భూకంపం వల్ల 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం వల్ల జపాన్ సునామీ హెచ్చరిక జారీ చేసింది.7.4 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఈశాన్య జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 30 సెంటీమీటర్ల వరకు నీటి మట్టాలు నమోదయ్యాయి. ఈశాన్య జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని ముందుగా జారీ చేసిన సునామీ హెచ్చరికను కేంద్రం గురువారం తెల్లవారుజామున ఎత్తివేసింది.




‘‘భూకంపం సంభవించిన తర్వాత కూలిపోయిన భవనాలకు దూరంగా ఉండండి’’ అని జపాన్ అధికారులు కోరారు.ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు, ఫుకుషిమా ప్రాంతంలో ఒకరు పొరుగున ఉన్న మియాగిలో ఒకరు మరణించారు. పలు ప్రాంతాల్లో భూకంపం వల్ల 90 మందికి పైగా గాయపడ్డారు.


Updated Date - 2022-03-17T13:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising