ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండురోజుల్లో 66,840 మందికి Covid పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-01-17T17:11:49+05:30

రాష్ట్రంలో వీకెండ్‌ కర్ఫ్యూలోను భయం కలిగించేలా కొవిడ్‌ విస్తరిస్తోంది. రెండురోజుల వ్యవధిలో ఏకంగా 66,840 మందికి కొవిడ్‌ ప్రబలింది. బెంగళూరులో వైరస్‌ అదుపుతప్పినట్లుగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో వీకెండ్‌ కర్ఫ్యూలోను భయం కలిగించేలా కొవిడ్‌ విస్తరిస్తోంది. రెండురోజుల వ్యవధిలో ఏకంగా 66,840 మందికి  కొవిడ్‌ ప్రబలింది. బెంగళూరులో వైరస్‌ అదుపుతప్పినట్లుగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 32,793 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇందులో బెంగళూరులో 22,284 మంది కాగా తుమకూరులో 1326, హాసన్‌లో 968, మైసూరు 729, మండ్య 718, దక్షిణకన్నడ 792, ధారవాడ 648, ఉడుపి 607, కోలార్‌ 541, బెంగళూరు గ్రామీణ 503 మందికి వైరస్‌ సోకింది. చామరాజనగర్‌, కొప్పళ, హవేరీ, విజయపుర, యాదగిరి జిల్లాల్లో మాత్రమే వందలోపు కేసులు నమోదు కాగా మిగిలిన అన్ని జిల్లాలోను అత్యధికంగా వెలుగు చూశాయి. 4,273 మంది డిశ్చార్జి కాగా ఏడుగురు మృతిచెందారు. ఆదివారం 34,047 మందికి వైరస్‌ ప్రబలగా బెంగళూరులో 21, 071 మంది, మైసూరు 1892, తుమకూరు 1373, హాసన్‌ 1171 మంది, బెంగళూరు గ్రామీణ 722, దక్షిణకన్నడ 782, మండ్య 709, ధారవాడ 634, ఉడుపి 591 మంది కలబురిగి 562, కోలార్‌ 552, బళ్లారి 566 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. హావేరి, కొప్పళ, యాదగిరి జిల్లాల్లో వందలోపు కేసులు నమోదు కాగా మిగిలిన అన్ని జిల్లాలలోను 500 లోపు కేసులు ప్రబలాయు. 5902 మంది డిశ్చార్జి కాగా 13 మంది మృతి చెందారు. వీరిలో బెంగళూరుకు చెందినవారు ఐదుగురు కాగా దక్షిణకన్నడ ఇద్దరు, మిగిలిన ఆరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఇప్పటి దాకా 38,431 మంది కొవిడ్‌కు బలయ్యారు. ప్రస్తుతం 30 జిల్లాలలో 1,97,982 మంది చికిత్సలు పొందుతున్నారు. 

Updated Date - 2022-01-17T17:11:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising