ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘానిస్థాన్ దేశంలో భూకంపం..26 మంది మృతి

ABN, First Publish Date - 2022-01-18T12:40:02+05:30

అప్ఘానిస్థాన్ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 26 మంది మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: అప్ఘానిస్థాన్ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 26 మంది మరణించారు. పశ్చిమ అప్ఘానిస్థాన్ దేశంలోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందని యూఎస్ జియాలజికల్ సర్వే వెల్లడించింది.బాద్ఘీస్ పశ్చిమ ప్రావిన్సు  పరిధిలోని క్వాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారని అప్ఘాన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ చెప్పారు. ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలతో సహా 26 మంది మరణించారని అప్ఘాన్ అధికార ప్రతినిధి చెప్పారు. తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మొదటిసారి భూకంపం సంభవించింది. క్వాదీస్ ప్రాంతం గత 20 ఏళ్లుగా తీవ్ర కరవు పరిస్థితులతో అల్లాడుతోంది. కరవు కరాళ నృత్యం చేస్తున్న క్వాదీస్ ప్రాంతంలోని హిందూ కుష్ పర్వత రేంజ్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.2015వ సంవత్సరంలో సంభవించిన భూకంపంలో 280 మంది మరణించారు. 


Updated Date - 2022-01-18T12:40:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising