ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Central Maliలో సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడి...27మంది సైనికుల మృతి

ABN, First Publish Date - 2022-03-05T13:01:58+05:30

సెంట్రల్ మాలిలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 27 మంది సైనికులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి దాడుల్లో 70 మంది ఉగ్రవాదుల హతం

బమాకో: సెంట్రల్ మాలిలోని సైనిక శిబిరంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 27 మంది సైనికులు మరణించారు. సెంట్రల్ మాలిలోని సైనిక స్థావరంపై జరిగిన మిలిటెంట్ దాడిలో 27 మంది సైనికులు మరణించగా, మరో 33 మంది గాయపడ్డారని ఆ దేశ ప్రభుత్వం తెలిపింది.మోండోరోలోని గ్రామీణ కమ్యూన్‌లో ఉగ్రవాదులు కారు బాంబులతో  దాడి చేశారు. ఈ దాడిలో మరో ఏడుగురు సైనికులు గల్లంతయ్యారు.సైన్యం ప్రతి దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు మరణించారు. సైనిక శిబిరంపై దాడి ఏ మిలిటెంట్ గ్రూపు చేసిందో ప్రకటించలేదు. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ రెండింటి అనుబంధ సంస్థలు సెంట్రల్ మాలిలో చురుకుగా పనిచేస్తున్నాయి.2012లో అల్ ఖైదా-సంబంధిత మిలిటెంట్లు ఉత్తరాన దాని ఎడారిని స్వాధీనం చేసుకుంది. 



మిలిటెంట్లు మళ్లీ మాలియన్ గ్రామీణ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఫ్రాన్స్ 2013వ సంవత్సరం నుంచి సెంట్రల్ మాలి ప్రాంతంలో వేలాది మంది సైనికులను మోహరించింది. అయితే పాలక మిలిటరీ జుంటాతో సంబంధాలు దెబ్బతిన్నందున మాలి నుంచి తన బలగాలను ఉపసంహరించుకుంటామని ఫ్రాన్స్ గత నెలలో ప్రకటించింది.

Updated Date - 2022-03-05T13:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising