ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ops ధైర్యశాలి: Ttv Dinakaran

ABN, First Publish Date - 2022-06-28T16:02:46+05:30

దుష్టశక్తుల నిలయంగా మారిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలిలో పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం ధైర్యంగా పాల్గొన్నారని, ఆయనకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): దుష్టశక్తుల నిలయంగా మారిన అన్నాడీఎంకే సర్వసభ్యమండలిలో పార్టీ సమన్వయకర్త పన్నీర్‌సెల్వం ధైర్యంగా పాల్గొన్నారని, ఆయనకు మద్దతుగా నిలిచిన వైద్యలింగం, జేసీడీ ప్రభాకరన్‌ సాహసవంతులని అమ్మా మక్కల మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ ప్రశంసించారు. పార్టీ తిరువళ్లూరు జిల్లా నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న అనంతరం దినకరన్‌ విలేకరులతో మాట్లాడారు. ఓపీఎస్ ను తాను రహస్యంగా కలుసుకుని మంతనాలు జరుపుతానని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న పుకార్లను ఖండించారు. ఓపీఎ్‌స్‌ను కలుసుకునేందుకు తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. అన్నాడీఎంకేని దుష్టశక్తుల నుండి విడిపించేందుకే తాను పార్టీని ప్రారంభించానని చెప్పారు. సర్వసభ్య మండలిలో ఓపీఎ్‌సపై వాటర్‌ బాటిల్‌ను విసిరివేశారని, ఆ మండలిలో ఇంతకు మించిన ఆపద కలిగించేవారున్నారని చెప్పారు. సర్వసభ్యమండలిలో ఎడప్పాడి ప్రధాన కార్యదర్శి అయ్యేందుకు వేసుకున్న పథకాన్ని ఓపీఎస్‌ కోర్టు ఉత్తర్వు ద్వారా అడ్డుకున్నారని ప్రశంసించారు. ఐపీఎల్‌ వేలం పాటల వలె ప్రస్తుతం సర్వసభ్య మండలి సభ్యులను కోట్లాది రూపాయలిచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. సర్వసభ్యమండలి సమావేశంలో ఐటీ అధికారులు గనుక తనిఖీలు చేసివుంటే కోట్లాది రూపాయలు పట్టుబడేదని దినకరన్‌ చెప్పారు. అన్నాడీఎంకేలో ఉన్నవారంతా పార్టీ దివంగత నేతలు ఎంజీఆర్‌, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తించడం లేదని ఆరోపించారు. 

Updated Date - 2022-06-28T16:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising