ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుతిన్‌ తెలివైన వాడు!

ABN, First Publish Date - 2022-02-28T08:24:02+05:30

సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా మీద ప్రపంచ దేశాధినేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యాపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా అధ్యక్షుడిని మళ్లీ పొగిడిన ట్రంప్‌


ఓర్లాండో, ఫిబ్రవరి 27: సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా మీద ప్రపంచ దేశాధినేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యాపై ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పొగుడుతూనే ఉన్నారు. తాజాగా ఓర్లాండోలో జరిగిన రిపబ్లికన్‌ పార్టీ సమావేశం ‘కన్జర్వేటివ్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కాన్ఫరెన్స్‌ (సీపీఏసీ)’లో ట్రంప్‌ మాట్లాడుతూ.. పుతిన్‌ ‘స్మార్ట్‌’ అంటూ కొనియాడారు.


ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ నాటో దేశాధినేతలు మూగవారిలా ఉండిపోయారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉక్రెయిన్‌పై భీకర దాడులు ప్రారంభమైన సమయంలోనూ ట్రంప్‌ రష్యా అధినేతను ప్రశంసించడం గమనార్హం. సీపీఏసీ సందర్భంగా ‘పుతిన్‌ తెలివైనవాడని భావిస్తున్నారా?’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నను గుర్తుచేసిన ట్రంప్‌.. ‘‘అవును. పుతిన్‌ తెలివైన వారు. నాటో దేశాలతోపాటు ప్రపంచ దేశాల ప్రతిస్పందన, బెదిరింపులు, వ్యూహాలను పరిశీలించినప్పుడు వారు తెలివిగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు’’ అని చెప్పారు.  


అమెరికానే కారణం: ఉత్తర కొరియా 

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు అమెరికానే కారణమని ఉత్తర కొరియా ఆరోపించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఓ పోస్ట్‌ను ఉంచింది. తన భద్రత కోసం రష్యా చట్టబద్ధమైన డిమాండ్‌ను పట్టించుకోకుండా అమెరికా సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని పరిశోధకుడు రి జి సాంగ్‌ చేసిన వ్యాఖ్యానాన్ని ఆ పోస్టులో ప్రస్తావించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే ప్రమాదం ఉందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ హెచ్చరించారు. రష్యాకు శక్తిమంతమైన బలగాలు ఉన్నాయని తెలుసని, అదేసమయంలో ఉక్రెయిన్‌ దేశస్థులు ధైర్యవంతులని పేర్కొన్నారు. వారి సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు పోరు కొనసాగిస్తారని చెప్పారు. పుతిన్‌ మరింత శక్తిమంతమైన, భయంకరమైన ఆయుధాలను వినియోగించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-02-28T08:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising