ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Petrol కోసం 5 రోజులు క్యూలో.. Truck driver మృతి

ABN, First Publish Date - 2022-06-24T01:17:41+05:30

లా చనిపోతున్న వారు 43 నుంచి 84 ఏళ్ల మధ్య వయసు వారే ఉంటున్నారట. కొద్ది రోజుల క్రితం 53 ఏళ్ల ఒక ఆటో డ్రైవర్ సైతం ఇలాగే ప్రాణాలు వదిలాడు. పెట్రోల్ కోసం తన ఆటోతో పాటు క్యూలైన్లో గంటల తరబడి నిల్చుని గుండెపోటుతో మరణించాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: శ్రీలంకలో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి తాజాగా జరిగిన ఒక సంఘటన పెద్ద ఉదాహారణ. పెట్రోల్ కోసం గత ఐదు రోజులుగా క్యూలో నిల్చున్న ఒక ట్రక్ డ్రవర్(63)  క్యూలైన్‌లోనే ప్రాణాలు వదిలాడు. డ్రవైర్ ట్రక్కులో ఉండగానే ఈ ఘటన జరిగింది. శ్రీలంకలోని అంగురువతోటలో గురువారం జరిగింది. అయితే ఇలా జరగడం శ్రీలంకలో కొత్తేం కాదు. ఇంతకు ముందు సుమారు తొమ్మిది మంది ఇలా పెట్రోల్ కోసం క్యూలైన్లో నిలబడి చనిపోయారు. ఇందులో చాలా మంది గుంటె పోటు ద్వారానే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో, లారీలో ఇలా తమ వాహనాల్లోనే రోజుల తరబడి ఎదురు చూస్తూ అలాగే గుండెపోటు వచ్చి మరణిస్తున్నారు.


ఇలా చనిపోతున్న వారు 43 నుంచి 84 ఏళ్ల మధ్య వయసు వారే ఉంటున్నారట. కొద్ది రోజుల క్రితం 53 ఏళ్ల ఒక ఆటో డ్రైవర్ సైతం ఇలాగే ప్రాణాలు వదిలాడు. పెట్రోల్ కోసం తన ఆటోతో పాటు క్యూలైన్లో గంటల తరబడి నిల్చుని గుండెపోటుతో మరణించాడు. ఇది శ్రీలంక రాజధాని కొలంబోలోనే జరిగిన సంఘటన. శ్రీలంక అత్యంత దుర్భర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. గడిచిన 70 ఏళ్లలో ఇదే అతిపెద్ద సంక్షోభం. దీంతో ఇంధనం తీవ్ర కొరత ఉంది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మందులు అందుబాటులో లేవు. వీటిని అధిగమించడానికి ప్రభుత్వ కొన్ని కార్యాలయాలు స్వచ్ఛందంగా శుక్రవారం సెలవును పాటిస్తున్నాయి. కాగా, ప్రభుత్వ తప్పిదాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని దేశంలో పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతోంది.

Updated Date - 2022-06-24T01:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising