ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donations to Regional Parties : విరాళాల్లో 91 శాతం పొందుతున్న ఐదు పార్టీలో టీఆర్ఎస్

ABN, First Publish Date - 2022-07-30T16:49:53+05:30

ప్రాంతీయ రాజకీయ పార్టీలకు లభించిన విరాళాల్లో సుమారు 91 శాతం వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రాంతీయ రాజకీయ పార్టీలకు లభించిన విరాళాల్లో సుమారు 91 శాతం వరకు కేవలం ఐదు పార్టీలకు చేరాయి. భారీగా విరాళాలను పొందిన ప్రాంతీయ పార్టీల్లో తెలంగాణా రాష్ట్ర సమితి (TRS) కూడా ఉంది. ఎన్నికల కమిషన్‌కు ప్రాంతీయ పార్టీలు సమర్పించిన నివేదికలను విశ్లేషించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (Association for Democratic Reforms - ADR) ఈ వివరాలను వెల్లడించింది. 


ఏడీఆర్ నివేదిక ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో పొందిన విరాళాల వివరాలను ప్రాంతీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌ (Election Commission)కు తెలిపాయి. మొత్తం సొమ్ములో  91.38 శాతం.  అంటే,  రూ.113.79 కోట్లు  ఐదు పార్టీలకు (జేడీయూ, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, టీఆర్ఎస్ - JD(U), DMK, AAP, IUML, TRS)  లభించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పొందిన విరాళాల కన్నా తమకు తాజాగా ఎక్కువ విరాళాలు వచ్చాయని జేడీయూ, డీఎంకే, టీఆర్ఎస్ వెల్లడించగా, తమకు తక్కువ విరాళాలు వచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ, ఐయూఎంఎల్ తెలిపాయి. 


ఈ నివేదికలో 54 ప్రాంతీయ పార్టీలకు లభించిన విరాళాలను విశ్లేషించారు. విరాళాలకు సంబంధించిన నివేదికలను నిర్దేశిత గడువులోగా ఎన్నికల కమిషన్‌కు  సమర్పించిన పార్టీలు కేవలం ఆరు (6) మాత్రమే ఉన్నాయని వెల్లడైంది. 25 పార్టీలు మూడు నుంచి 164 రోజులపాటు ఆలస్యంగా ఈ నివేదికలను ఈసీకి  సమర్పించాయి. 3,051 డొనేషన్స్ నుంచి రూ.124.53 కోట్లు లభించినట్లు 27 ప్రాంతీయ పార్టీలు పేర్కొన్నాయి. 


జేఎంఎం, ఎన్‌డీపీపీ, డీఎండీకే, ఆర్ఎల్‌టీపీ పార్టీలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో విరాళాల రాక గురించి ప్రకటించలేదు. జేడీయూకు 330 డొనేషన్ల ద్వారా  అత్యధికంగా రూ.60.15 కోట్లు వచ్చింది. డీఎంకేకు 177 డొనేషన్ల ద్వారా రూ.33 కోట్ల 99 లక్షల 30 వేలు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.11.32 కోట్లు, ఐయూఎంఎల్‌కు రూ.4.16 కోట్లు, టీఆర్ఎస్‌కు రూ.4.15 కోట్లు లభించింది. 


Updated Date - 2022-07-30T16:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising