ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Philippinesలో వెల్లువెత్తిన వరదలు...138 మంది మృతి

ABN, First Publish Date - 2022-04-15T12:55:30+05:30

ఫిలిప్పీన్స్‌ను వణికించిన ఉష్ణమండల తుపాన్ విపత్తు వల్ల మృతుల సంఖ్య 138కి పెరిగిందని ఆ దేశ అధికారులు తెలిపారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనీలా: ఫిలిప్పీన్స్‌ను వణికించిన ఉష్ణమండల తుపాన్ విపత్తు వల్ల మృతుల సంఖ్య 138కి పెరిగిందని ఆ దేశ అధికారులు తెలిపారు.ఫిలిప్పీన్స్‌లోని మధ్య, దక్షిణ ప్రాంతాల్లో కురిసిన భారీవర్షాల వల్ల వరదలు వెల్లువెత్తాయి. వరదలతో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్య లేటె ప్రావిన్స్‌లో 132 మంది మరణించారు. పలు గ్రామాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 101 మృతదేహాలను వెలికితీసినట్లు బేబే సిటీ ప్రభుత్వం తెలిపింది. లేటె ప్రావిన్స్‌లోని అబుయోగ్ పట్టణంలో 31 మృతదేహాలు, సమర్ ప్రావిన్స్‌లో ఒకటి,సెబూ ప్రావిన్స్‌లో రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


మధ్య ఫిలిప్పీన్స్‌లోని కాపిజ్, అక్లాన్, యాంటిక్, ఇలోయిలో ప్రావిన్స్‌లలోని 159 ప్రాంతాలు వరదనీటిలో మునిగాయి. పసిఫిక్ టైఫూన్ బెల్ట్‌పై ఉన్న ఫిలిప్పీన్స్ ద్వీపసమూహం ప్రపంచంలోని అత్యంత విపత్తు-పీడిత దేశాల్లో ఒకటిగా ఉంది. ఫిలిప్పీన్స్  ప్రతి సంవత్సరం దాదాపు 20 టైఫూన్లు తుపానులతో దెబ్బతింటుంది.


Updated Date - 2022-04-15T12:55:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising