ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tripura Bypolls Results : బీజేపీ విజయం... సీఎం మాణిక్ సాహాకు స్వల్ప ఆధిక్యం...

ABN, First Publish Date - 2022-06-26T18:53:21+05:30

త్రిపురలో నాలుగు శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : త్రిపురలో నాలుగు శాసన సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడింటిని బీజేపీ గెలుచుకోగా, ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా టౌన్ బర్డోవలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాపై 6,104 ఓట్ల ఆధిక్యతతో గెలిచినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ విజయంతో ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి మార్గం సుగమం అయింది. 


ఈ ఉప ఎన్నికల్లో టౌన్ బర్డోవలి, జుబరాజ్ నగర్, సుర్మ స్థానాలను బీజేపీ సొంతం చేసుకోగా, కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ బర్మన్ అగర్తల నియోజకవర్గం నుంచి 3,163 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 


ఈ నాలుగు నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ జూన్ 23న జరిగింది. 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దాదాపు 78 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 


త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా (రాజ్యసభ సభ్యుడు) గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో  మాణిక్ ఆ పదవిని చేపట్టారు. ఆ పదవిలో కొనసాగాలంటే చట్ట ప్రకారం ఎమ్మెల్యేగా గెలవడం తప్పనిసరి. ఈ ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయవలసి ఉంటుంది. 


టౌన్ బర్డోవలీ శాసన సభ్యుడు ఆశిష్ కుమార్ సాహా బీజేపీకి రాజీనామా చేసి, ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 


Updated Date - 2022-06-26T18:53:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising