ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra Political Crisis: ద్రోహుల్ని మళ్లీ పార్టీలోకి తీసుకోబోం: ఆదిత్య థాకరే హెచ్చరిక

ABN, First Publish Date - 2022-06-27T01:13:53+05:30

శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: శివసేన నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం ఇంకా ఓ కొలిక్కి రాలేదు సరికదా రోజురోజుకు మరింత ముదురుతోంది. ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా షిండే శిబిరానికి జారిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అభయమిచ్చారు. చివరి క్షణం వరకు మీతోనే ఉంటామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రస్తుత అధికార కూటమికేనని, ఈ విషయంలో ఎలాంటి సంశయం అవసరం లేదని స్పష్టం చేశారు. 


మరోవైపు, రెబల్ ఎమ్మెల్యేలను మంత్రి ఆదిత్య థాకరే తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పార్టీకి ద్రోహం చేసిన రెబల్ ఎమ్మెల్యేలను మళ్లీ శివసేనలోకి తీసుకోబోమని తేల్చిచెప్పారు. వెళ్లిపోవాలనుకునే వారి కోసం, అలాగే వెనక్కి వచ్చే వారి కోసం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయన్నారు. షిండే క్యాంపులోని 15 మంది ఎమ్మెల్యేలకు కేంద్ర హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ భద్రత కల్పించింది. వీరిలో రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే లేకపోవడం గమనార్హం. ఇంకోవైపు, గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఏక్‌నాథ్ షిండే వర్గం భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తోంది. 

Updated Date - 2022-06-27T01:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising