ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు రైళ్ల దారి మళ్లింపు

ABN, First Publish Date - 2022-06-30T14:07:20+05:30

విరంగన లక్ష్మిబాయ్‌, కాన్పూర్‌ సెక్షన్లలో మరమ్మతు చేపట్టనున్న కారణంగా చెన్నై మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను దారి మళ్లించినట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): విరంగన లక్ష్మిబాయ్‌, కాన్పూర్‌ సెక్షన్లలో మరమ్మతు చేపట్టనున్న కారణంగా చెన్నై మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. అలాగే చెన్నై బీచ్‌ - తాంబరం స్టేషన్ల మధ్య ఈ నెల 30, జూలై 2, 4 తేదీల్లో రాత్రిపూట పలు రైళ్లను రద్దు చేశారు. ఆ మేరకు దక్షిణ రైల్వే ప్రకటన విడుదల చేసింది. - జూలై 9, 12 తేదీల్లో ఉదయం 5.15 గంటలకు బయలుదేరే చెన్నై సెంట్రల్‌ - లక్నో బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (16093) విరంగన లక్ష్మిబాయ్‌, గ్వాలియర్‌, ఆగ్రా కంటోన్మెంట్‌, తుండ్ల, ఎటవాహ్‌, కాన్పూర్‌ మీదుగా వెళ్తుంది. - జూలై 11, 14 తేదీల్లో సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరే లక్నో - చెన్నై సెంట్రల్‌ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (16094) కాన్పూర్‌, ఎటవాహ్‌, తుంట్ల, ఆగ్రా కంటోన్మెంట్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మిబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. - జూలై 1, 3, 7, 8, 10, 14 తేదీల్లో ఉదయం 6.35 గంటలకు బయలుదేరే గోరఖ్‌పూర్‌ - కొచ్చువేలి రప్తిసాగర్‌ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (12511) కాన్పూర్‌, ఎటవాహ్‌, తుంట్ల, ఆగ్రా కంటోన్మెంట్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మిబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. - జూలై 4, 11 తేదీల్లో రాత్రి 10.51 గంటలకు బయలుదేరే బరౌనీ - ఎర్నాకులం జంక్షన్‌ రప్తిసాగర్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (12521)కాన్పూర్‌, ఎటవాహ్‌, తుంట్ల, ఆగ్రా కంటోన్మెంట్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మిబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. - జూలై 2, 9 తేదీల్లో ఉదయం 8.30 గంటలకు బయలుదేరే గోరఖ్‌పూర్‌ - ఎర్నాకులం జంక్షన్‌ వీక్లీ స్పెషల్‌ (05303) కాన్పూర్‌, ఎటవాహ్‌, బింద్‌, గ్వాలియర్‌, విరంగన లక్ష్మీబాయ్‌ స్టేషన్ల మీదుగా రానుంది. 

Updated Date - 2022-06-30T14:07:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising