ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్లలో దిండ్లు, దుప్పట్ల సేవల పునరుద్ధరణ

ABN, First Publish Date - 2022-05-25T17:11:25+05:30

కొవిడ్‌ కారణంగా రెండున్నర సంవత్సరాలపాటు ఏసీ రైళ్లలో నిలిపివేసిన తలగడలు, దుప్పట్ల సరఫరాను నైరుతి రైల్వేజోన్‌ పునరుద్ధరించింది. తొలిదశలో 14 మార్గాల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                    - నైరుతి రైల్వేజోన్‌ కీలక నిర్ణయం 


బెంగళూరు: కొవిడ్‌ కారణంగా రెండున్నర సంవత్సరాలపాటు ఏసీ రైళ్లలో నిలిపివేసిన తలగడలు, దుప్పట్ల సరఫరాను నైరుతి రైల్వేజోన్‌ పునరుద్ధరించింది. తొలిదశలో 14 మార్గాల్లో సంచరించే రైళ్లలో వీటిని ప్రయాణికులకు అందుబాటులోకి దశలవారీగా తీసుకురానున్నారు. ఈమేరకు నైరుతి రైల్వేజోన్‌ బెంగళూరు డివిజన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు - హజరత్‌ నిజాముద్దీన్‌ మధ్య నిత్యం సంచరించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు - న్యూఢిల్లీ మధ్య సంచరించే సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు - చెన్నై మధ్య సంచరించే సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. త్వరలో కన్యాకుమారి - బెంగళూరు మధ్య సంచరించే డైలీ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూ రు - మీరజ్‌ డైలీ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు - బెళగావి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు - పంచగంగ డైలీ ఎక్స్‌ప్రె్‌సలలో త్వరలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. యశ్వంతపుర - చండీఘడ్‌ మధ్య వారానికి రెండు సార్లు, యశ్వంతపుర - కొచ్చివేలి మధ్య వారానికి ఒకసారి, యశ్వంతపుర - ఢిల్లీ మధ్య వారానికి ఒకసారి సంచరించే డురంటో ఎక్స్‌ప్రెస్‌, యశ్వంతపుర - హజరత్‌ నిజాముద్దీన్‌ మధ్య వారానికి సంచరించే సం పర్కక్రాంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, మైసూరు - నిజాముద్దీన్‌ మధ్య వారానికి ఒకరోజు సంచరించే స్వర్ణ జయంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, హుబ్బళ్లి - హైదరాబాద్‌ మధ్య రోజూ సంచరించే ఎక్స్‌ప్రెస్‌ రైలులో అతిత్వరలో అందుబాటులోకి వస్తాయని ఆ ప్రకటనలో రైల్వే అ ధికారులు పేర్కొన్నారు.  

Updated Date - 2022-05-25T17:11:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising