ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు ప్రయాణం చేస్తున్నారా.. లగేజీ ఎంతవరకు అనుమతిస్తారంటే...!

ABN, First Publish Date - 2022-06-04T14:57:19+05:30

ఇప్పటి వరకు విమానాల్లో మాత్రమే ప్రయాణికుడి లగేజీపై పరిమితి ఉంది. ఇకపై రైళ్లలో కూడా పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ప్రత్యేక రుసుము

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 3: ఇప్పటి వరకు విమానాల్లో మాత్రమే ప్రయాణికుడి లగేజీపై పరిమితి ఉంది. ఇకపై రైళ్లలో కూడా పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ప్రత్యేక రుసుము వసూలుచేయనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌ నుంచి ద్వితీయ శ్రేణి బోగీల్లో ప్రయాణికులు పరిమితంగా లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. ఏసీ బోగీలో 70 కిలోలు, ఏసీ-2 టైర్‌లో 50 కిలోలు, ఏసీ-3 టైర్‌లో 40 కిలోల లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అలాగే, 2 క్లాస్‌ బోగీలో 40 కిలోలు, సాధారణ బోగీల్లో 35 కిలోల వరకు లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు. కానీ, కొందరు నిర్ణీత బరువు కన్నా అధికంగా తీసుకెళ్తున్నట్లు రైల్వే శాఖకు ఫిర్యాదులందాయి. దీనిపై స్పందించిన రైల్వే శాఖ, అనుమతించిన లగేజీ కన్నా అధికంగా తీసుకెళ్తే ప్రత్యేక రుసుము చెల్లించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రత్యేక చార్జీతో పాటు పెనాల్టీ విధిస్తామని పేర్కొంది.

Updated Date - 2022-06-04T14:57:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising