ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటకుల కోసం లగ్జరీ నౌక

ABN, First Publish Date - 2022-06-04T12:52:06+05:30

నగరంలో టూరిస్ట్‌ లగ్జరీ నౌకాయాన సేవలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం ప్రారంభించనున్నారు. తొలివిడతగా హార్బర్‌ నుంచి కొన్ని నాటికల్‌ మైళ్ళ దూరం వరక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - నేడు ప్రారంభించనున్న Cm Stalin


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 3: నగరంలో టూరిస్ట్‌ లగ్జరీ నౌకాయాన సేవలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం ప్రారంభించనున్నారు. తొలివిడతగా హార్బర్‌ నుంచి కొన్ని నాటికల్‌ మైళ్ళ దూరం వరక వెళ్లి తిరిగొచ్చే విధంగా లగ్జరీ నౌకా పర్యటన ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మదివేందన్‌ తెలిపారు. తొలుత రెండు రోజులపాటు ఈ నౌకలో పర్యాటకులు సముద్రయానం చేసేందుకు అనుమతించనున్నారు. భవిష్యత్తులో విశాఖపట్నం, పుదుచ్చేరి నగరాలకు, శ్రీలంకలోని కొలంబో నగరానికి కూడా ఈ సేవలను విస్తరింపజేయనున్నారు. ఈ మేరకు తొలివిడతగా మద్రాసు హార్బర్‌ నుంచి ప్రైవేటు సంస్థకు చెందిన టూరిస్ట్‌ లగ్జరీ నౌక సేవలను శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించనున్నారు. ఈ నౌకలో రెండు రాత్రు లు, ఐదు రాత్రులు బసచేసేలా నౌకాయానం నిర్వహించనున్నారు. ఈ నౌకలో క్యాంటీన్లు, ప్లే గ్రైండ్‌లు, ఆడిటోరియం, వినోద కార్యక్రమాలకు ప్రత్యేక వసతులు కల్పించారు. నగరం నుంచి రెండున్నరేళ్ల అనంతరం టూరిస్ట్‌ లగ్జరీ నౌకాయాన సేవలు శనివారం ప్రారంభమై సెప్టెంబరు 23వ తేది వరకు కొనసాగనున్నాయి.  

Updated Date - 2022-06-04T12:52:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising