రేపు 790 కోట్లకు ప్రపంచ జనాభా
ABN, First Publish Date - 2022-12-31T05:08:51+05:30
2023 కొత్త సంవత్సరం రోజున ప్రపంచ జనాభా 790 కోట్లకు చేరుతుందని అమెరికా సెన్సస్ బ్యూరో అంచనా వేసింది.
న్యూయార్క్, డిసెంబరు 30: 2023 కొత్త సంవత్సరం రోజున ప్రపంచ జనాభా 790 కోట్లకు చేరుతుందని అమెరికా సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. గత నూతన సంవత్సరం కంటే 7.37 కోట్ల జనాభా అధికం కానున్నట్లు గురువారం వెల్లడించింది. 2023 జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకన్‌కు 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయని పేర్కొంది. అలాగే యూఎస్ జనాభా 33 కోట్ల 42 లక్షలకు చేరుతుందని తెలిపింది.
Updated Date - 2022-12-31T05:08:52+05:30 IST