ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tomato Flu: పిల్లల్ని వణికిస్తున్న టొమాటో ఫ్లూ జ్వరాలు

ABN, First Publish Date - 2022-08-24T16:16:41+05:30

దేశంలో ప్రబలుతున్ (spread)టొమాటో ఫ్లూ(Tomato Flu) జ్వరాలు పిల్లల్ని(children) వణికిస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సలహా

న్యూఢిల్లీ: దేశంలో ప్రబలుతున్ (spread)టొమాటో ఫ్లూ(Tomato Flu) జ్వరాలు పిల్లల్ని(children) వణికిస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో 9ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న 100 పిల్లలకు టొమాటో ఫ్లూ జ్వరాలు సోకాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ ఫ్లూ వ్యాధి వల్ల పిల్లల, చేయి, పాదాలు, నోటి వద్ద వైవిధ్యంగా కనిపిస్తోంది.హర్యానా,కేరళ, కర్ణాటక (Karnataka), తమిళనాడు‘(Tamil Nadu), ఒడిశా రాష్ట్రాల్లో టొమాటో ఫ్లూ జ్వరాల కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్రం (central government)రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.టొమాటో ఫ్లూ వ్యాధిపై కేంద్రం తాజాగా సలహా జారీ చేసింది.


కేరళలోని( Kerala) కొల్లం జిల్లాలో టొమాటో ఫ్లూ జ్వరం మొదటి కేసు బయటపడింది. ఆ తర్వాత అంచల్, ఆర్యంకావు,నెడువత్తూరులకు వ్యాపించింది. ఈ ఫ్లూ వ్యాధి లక్షణాలు( viral disease), దుష్ప్రభావాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని కేంద్రం సలహా ఇచ్చింది.టొమాటో ఫ్లూ జ్వరపీడితులకు అలసట, శరీర నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి ఇతర వైరల్ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెప్పారు. టొమాటో ఫ్లూ వచ్చిన వారి నుంచి ఇతర పిల్లలకు లేదా పెద్దలకు ఫ్లూ వ్యాధి సంక్రమించకుండా నిరోధించడానికి ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు.




ఒడిశా రాష్ట్రంలో 26 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు.ఈ ఫ్లూ వచ్చిన పిల్లలను తాకవద్దని, పిల్లలు బొటనవేలిని చప్పరించే అలవాటును మానుకోవాలని వైద్యులు సూచించారు.జలుబుతో ముక్కు కారుతున్నపుడు, దగ్గినపుడు చేతిరుమాలును అడ్డం పెట్టుకోవాలని వైద్యులు చెప్పారు. వేడినీళ్లతో పిల్లలకు స్నానం చేయించడం, రోగనిరోధక శక్తిని పెంచేలా పోషకాహారం అందించాలని వైద్యులు కోరారు. వ్యాధి పీడితులకు తగినంత విశ్రాంతి, సరైన నిద్ర అవసరమని ఆరోగ్యశాఖ నిపుణులు సూచించారు.

Updated Date - 2022-08-24T16:16:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising