ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prime Minister: అడుగడుగునా నిఘా

ABN, First Publish Date - 2022-09-02T18:17:58+05:30

దక్షిణాదిన భారీ ఓడరేవు కేంద్రంగాను, సుదీర్ఘ సముద్ర తీరంతో పాటు ఇటీవల మతకలహాలకు కేంద్రంగా పేరొందిన దక్షిణకన్నడ జిల్లా కేంద్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భద్రతా వలయంలో మంగళూరు 

- నేడు ప్రధాని రాక ఫ ఏర్పాట్లు పూర్తి 

- భారీ బహిరంగ సభకు సన్నాహాలు


బెంగళూరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాదిన భారీ ఓడరేవు కేంద్రంగాను, సుదీర్ఘ సముద్ర తీరంతో పాటు ఇటీవల  మతకలహాలకు కేంద్రంగా పేరొందిన దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండువారాల కిందటే ప్రధానమంత్రి పర్యటన ఖరారు కాగా అప్పటి నుంచే ఏర్పాట్లు సాగాయి. శుక్రవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ రాష్ట్రం కొచ్చిన్‌ నుంచి ప్రత్యేక విమానంలో బజ్పే విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఓడరేవుకు అనుబంధంగా మత్సశాఖ ఆధ్వర్యంలో అభివృద్ది ప నులకు శంకుస్థాపనలు చే స్తారు. ఎన్‌ఎంపీఏ బెర్త్‌ నంబరు 14 అభివృద్దికి గాను రూ.280.71 కోట్లు, ఎంఆర్‌పీఎల్‌కు చెందిన బీఎస్‌ 6 ఉన్నతీకరణ ప్రాజెక్టు రూ.1829 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఆతర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో చర్చాగోష్టిలో పాల్గొననున్నారు. ఆతర్వాత మంగళూరు శివారు కొళూరు గోల్డ్‌పింఛ్‌ సిటీ మైదానంలో బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. మంగళూరు(Mangalore)లో మూడు కార్యక్రమాలలో పాల్గొంటున్నందున నగరాన్ని పోలీసువలయంగా మార్చేశారు. మూడు రోజుల కిందటే ఎస్‌పీజీ బలగాలు చేరుకుని పరిశీలన జరుపగా గురువారం మధ్యాహ్నం కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ జరిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మంగళూరు వ్యాప్తంగా శుక్రవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపుతో పాటు ట్రయల్‌ కోసం పలు నిబంధనలు విధించిన మేరకు సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. వీటిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసిన పోలీసులు ముందుగా అనుమానితులను బైండోవర్‌ చేశారు. సముద్ర తీర నగరం కావడంతో ఓడరేవుతో పాటు తీరమంతటా సీగార్డ్‌ ఫోర్స్‌, యాంటీ డ్రోన్‌ యాక్షన్‌ బెటాలియన్‌లు పర్యవేక్షణ సాగిస్తున్నాయి. గరుడ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజ ర్వు, కేఎస్ఆర్‌పీ, ఆర్‌ఎపీ బలగాలతో పాటు దక్షిణకన్నడ, ఉత్తరకన్నడ, ఉడుపి జిల్లాలకు చెందిన పోలీసులు పెద్దఎత్తున మొహరింపజేశారు. గురువారం సాయంత్రం పోలీసులు రూట్‌మార్చ్‌ చేశారు. లాఅండ్‌ ఆర్డర్‌ ఏడీజీపీ అలోక్‌కుమార్‌ ప్రధాని పర్యటన ప్రాంతాలను ఎస్‌పీతో క లిసి పరిశీలించారు.


కార్యకర్తలకు సూచనలు

మంగళూరు సమీపాన బీజేపీ యువనేత ప్రవీణ్‌ నెట్టారు హత్యానంత రం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్త లు జిల్లావాసులే కాకుండా సమీప జిల్లాలకు చెందిన వారు రాజీనామాలు ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో తరచూ ఘర్షణలకు ఎస్‌డీపీఐ, పీఎ్‌ఫఐ సంస్థలకు చెందిన వారే కారకులను రెండుసంస్థలను రద్దుచేయాలనే డిమాండ్‌ సాగుతోంది. ప్రధాని పర్యటనలో ఎవరైనా ప్రస్తావించ వచ్చునని భావించి కార్యకర్తలకు నాయకులు సలహాలిచ్చినట్లు తెలుస్తోంది.


ప్రధాని సభకు లక్షన్నర మంది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే బహిరంగ సభకు కనీసం లక్షన్నర మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. భారీ షామియానాను ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో మొబైల్‌ లో ఫోటోలు తీయడాన్ని నిషేధించారు. ఎటువంటి వస్తువులు తీసుకురాకూడదని ప్రజలకు పోలీసులు విన్నవించారు. ఎటువంటి వస్తువులు ఉన్నా నిశబ్దంగా అక్కడినుంచి వారిని పంపించివేసేలా ఏర్పాటు చేశారు. ఐదుగురు ఎస్‌పీలు ప్రత్యేక విభాగాలను పర్యవేక్షించనున్నారు. ప్రధాని పాల్గొనే ప్రతి చోటా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజల కోసం సుమారు రెండువేలకు పైగా బస్సులు, ఇతరత్రా వాహనాలను సిద్దం చేశారు.

Updated Date - 2022-09-02T18:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising