ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Counselling: నేటినుంచి ఇంజినీరింగ్‌ జనరల్‌ కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2022-09-10T14:07:41+05:30

అన్నా విశ్వవిద్యాలయ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి ‘ఆన్‌లైన్‌’ జనరల్‌ కౌన్సెలింగ్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 9: అన్నా విశ్వవిద్యాలయ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి ‘ఆన్‌లైన్‌’ జనరల్‌ కౌన్సెలింగ్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 443 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1.50 లక్షల సీట్లున్నాయి. ఈ విద్యా సంవత్సరం సుమారు 1.59 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనుండగా, క్రీడాకారుల విభాగం, దివ్యాంగులు, మాజీ సైనికుల వారసులు తదితర ప్రత్యేక విభాగాల విద్యార్థుల కౌన్సెలింగ్‌(Counselling) గత నెల 20 నుంచి 23వ తేది వరకు జరిగింది. మిగిలిన సీట్లను 25 నుంచి నిర్వహించే జనరల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రకటించినా, ‘నీట్‌’ ఫలితాల విడుదల జాప్యం కారణంగా రెండు సార్లు వాయిదాపడింది.


నవంబరు 20వ తేది వరకు...

బుధవారం నీట్‌  ఫలితాలు విడుదల కావడంతో, శనివారం నుంచి  ప్రారంభమయ్యే జనరల్‌ కౌన్సెలింగ్‌ నాలుగు విడతలుగా, నవంబరు 13తో ముగియనుంది. అనంతరం 15 నుంచి 20వ తేది వరకు ఉప కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. తొలివిడత కౌన్సెలింగ్‌ శనివారం ప్రారంభమవుతుండగా, రెండో విడత కౌన్సెలింగ్‌ 25, మూడో విడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 13, నాలుగో విడత కౌన్సెలింగ్‌ 29వ తేది నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక్కో కౌన్సిలింగ్‌కు అర్హులైన విద్యార్థుల ర్యాంకుల జాబితా సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి చదివిన విద్యార్థులకు కేటాయించిన 7.5 శాతం రిజర్వేషన్‌కు సంబంధించిన కౌన్సెలింగ్‌(Counselling) నాలుగు విడతలుగా, జనరల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించే రోజుల్లోనే నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల సీట్లకు అర్హులైన విద్యార్థులు, జనరల్‌ కౌన్సిలింగ్‌తో పాటు ప్రభుత్వ పాఠశాల రిజర్వేషన్‌ విభాగంలోనూ ఒకేసారి నమోదుచేసుకోవచ్చు. రెండింటిలో ఒకదానిని ఇష్టపడి విద్యార్థులు చేరవచ్చని కౌన్సెలింగ్‌ కమిటీ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-09-10T14:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising