ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏప్రిల్‌లో ఇండియా రానున్న ఇజ్రాయెల్ ప్రధాని

ABN, First Publish Date - 2022-03-20T18:09:14+05:30

ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని మోదీ వినతి మేరకు ఏప్రిల్ 2-5 వరకు నఫ్టాలీ ఇండియాలో పర్యటించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇజ్రాయెల్ ప్రధాని నఫ్టాలీ బెన్నెట్ వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని మోదీ వినతి మేరకు ఏప్రిల్ 2-5 వరకు నఫ్టాలీ ఇండియాలో పర్యటించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మోదీ, నఫ్టాలీని ఆహ్వానించారు. నఫ్టాలీ ఇజ్రాయెల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇండియా రావడం ఇదే మొదటిసారి. గత అక్టోబర్‌లో గ్లాస్గోలో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో మోదీ-నఫ్టాలీ మొదటిసారి కలుసుకున్నారు. ఆ సమయంలో మోదీ, నఫ్టాలీని ఇండియా రమ్మని ఆహ్వానించారు. నఫ్టాలీ భారత పర్యటన సందర్భంగా ఇండియా-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు పలు అంశాలపై చర్చిస్తారు. ప్రధానంగా ఇన్నోవేషన్ టెక్నాలజీ, భద్రత, సైబర్, ఎకానమీ, వ్యవసాయం, వాతావరణ మార్పులు వంటి అంశాలపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. భారత పర్యటన కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు నఫ్టాలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-03-20T18:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising