ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facebook New Feature: మిత్రుల పోస్ట్‌లన్నిటినీ చూడటం ఇక మరింత సులువు

ABN, First Publish Date - 2022-07-22T18:35:58+05:30

ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఫేస్‌బుక్ ( Facebook) సరికొత్త ఫీచర్‌ను సిద్ధం చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : టిక్‌టాక్ (TikTok) నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఫేస్‌బుక్ ( Facebook) సరికొత్త ఫీచర్‌ను సిద్ధం చేసింది. దీంతో మిత్రుల పోస్ట్‌లన్నిటినీ వరుస క్రమంలో మరింత సులువుగా చూడటం సాధ్యమవుతుంది. ఇతర వేదికలవైపు వెళ్ళినవారిని తిరిగి రప్పించడానికి ఈ అప్‌డేట్ దోహదపడుతుందని ఫేస్‌బుక్ ఆశిస్తోంది. ఫేస్‌బుక్‌కు 2 బిలియన్ల మంది డైలీ యూజర్లు ఉన్నారు. 


ఫేస్‌బుక్ గురువారం అప్‌డేట్స్‌ను ప్రకటించింది. ఈ యాప్‌ను తెరవగానే, వ్యక్తుల ఆసక్తులు, అభిరుచులకు తగినట్లుగా అంశాలు, మిత్రులు హైలైట్ అయ్యే న్యూస్ ఫీడ్ పోస్ట్‌లను అందుబాటులో ఉంచుతుంది. ఓ ఆల్గారిథమ్ వీటిని ఎంపిక చేస్తుంది. షార్ట్ వీడియోలను చూసేందుకు హోమ్ సెక్షన్‌లో ఓ ఆప్షన్‌‌ను పెట్టింది. ఇది టిక్‌టాక్ తరహాలోని Reels ఫీచర్. 


అయితే చాలా మంది యూజర్లు ఈ కొత్త ఫీచర్ పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇది తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలరైజింగ్ ఎకో చాంబర్స్‌ను సృష్టిస్తోందని ఆరోపించారు. 


Meta Platforms యాజమాన్యంలోని ఫేస్‌బుక్ ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఐఫోన్, ఆండ్రాయిడ్‌లలో ఉపయోగించే మొబైల్ యాప్‌లోని షార్ట్‌కట్ బార్‌లో నోటిఫికేషన్స్ ట్యాబ్‌కు ఎడమవైపు కొత్తగా Feed ట్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ Feed ట్యాబ్‌పై క్లిక్ చేసి, తమ ఫేస్‌బుక్ ఫేవరెట్స్, తాము చేరిన ఫేస్‌బుక్ గ్రూప్స్ లేదా తమ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్  ఇచ్చిన పోస్ట్‌ల ఫీడ్స్ వరుస క్రమంలో కనిపించేలా చేసుకోవచ్చు. 


ఇంటరెస్టింగ్ పోస్ట్‌లను మిస్ అయిపోతున్నామని యూజర్లు ఆరోపిస్తుండటంతో ఫేస్‌బుక్ ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్లు ఎక్కువగా కోరిన ఫీచర్లలో ఒకదానిని ప్రవేశపెట్టినట్లు ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫీచర్‌తో ఫ్రెండ్స్ పోస్ట్‌లను యూజర్లు మిస్ కాబోరని పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-22T18:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising