ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌లో 18 బిల్లులా?

ABN, First Publish Date - 2022-04-21T16:49:18+05:30

రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న రాజ్‌భవన్‌ ముట్టడించి నిరసన తెలుపనున్నట్లు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రజా వ్యతిరేక గవర్నర్‌కు నిరసన తెలుపుతాం

- 28న రాజ్‌భవన్‌ ముట్టడి 

- టీఎన్‌సీసీ అధ్యక్షుడు అళగిరి


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న రాజ్‌భవన్‌ ముట్టడించి నిరసన తెలుపనున్నట్లు తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ప్రకటించారు. రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తిభవన్‌లో బుధవారం అళగిరి మీడియాతో మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలో రాష్ట్ర గవర్నర్లకు వ్యతిరేకంగా మాట్లాడకూడదని, ఆందోళన చేపట్టరాదన్న చట్టం లేదని, పలు రాష్ట్రాల్లో గవర్నర్ల తీరును ఎండగడుతూ రైతు సంఘాలు ఉద్యమాలు చేపట్టాయన్నారు. నీట్‌ సహా 18 బిల్లులను పరిశీలించకుండా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పెండింగ్‌లో ఉంచారని, వీటిని వెంటనే రాష్ట్రపతి దృష్టికి పంపించాలన్న డిమాండ్‌తో తమ పార్టీ తరఫున ఈ నెల 28న గిండిలోని రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌కు నిరసన తెలపడం తమ హక్కు అని పేర్కొన్నారు. హిందీ భాష అవసరమేనని, అయితే దానిని తమిళనాట బలవంతంగా అమలుపరచరాదని కేఎస్‌ అళగిరి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి, కౌన్సిలర్లు శివరాజశేఖరన్‌, ఎంఎస్‌ ద్రవ్యం, జె.ఢిల్లీబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-21T16:49:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising