ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం స్మగ్లరుకు పార్టీ కార్యదర్శి పదవి...బీజేపీ నిర్వాకం

ABN, First Publish Date - 2022-06-15T18:10:56+05:30

రాజకీయాల్లో నేరస్థుల సంఖ్య పెరుగుతుండటం ఇటీవల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివాదం రేగడంతో రెండు గంటల్లోనే ఉత్తర్వుల రద్దు

చెన్నై(తమిళనాడు):రాజకీయాల్లో నేరస్థుల సంఖ్య పెరుగుతుండటం ఇటీవల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.తమిళనాడు భారతీయ జనతాపార్టీ (బీజేపీ) విభాగం సాక్షాత్తూ ఎర్రచందనం మాజీ స్మగ్లర్‌కు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన బాగోతం తాజాగా వెలుగుచూసింది.ఎర్రచందనం స్మగ్లింగ్ చరిత్ర కలిగిన కె వెంకటేశన్‌ను బీజేపీ ఒబీసీ మోర్చా కింద రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అయితే పార్టీలో వివాదం చెలరేగడంతో బీజేపీ నేతలు వెంకటేశన్ ను రెండు గంటల్లోనే నియామక ఆర్డర్‌ను రద్దు చేస్తూ పదవి నుంచి తొలగించారు. తిరువళ్లూరు తూర్పు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా కే వెంకటేశన్ (54) జూన్ 13న నియమితులయ్యారు.కానీ రెండు గంటల్లోనే ఆయన పేరును మినహాయించి సవరించిన జాబితాను తమిళనాడు బీజేపీ విభాగం పంపింది. రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెంకటేశన్‌పై ఏడు స్మగ్లింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లో హత్యాయత్నం కేసు కూడా ఉంది. 


2011లో గూండాస్ చట్టం కింద ఇతను అరెస్టయ్యారు. 2015లో కూడా విదేశాలకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రా పోలీసులు వెంకటేశన్ ను అరెస్ట్ చేశారు.ప్రస్తుతం వెంకటేశన్ బీజేపీలో ఉన్నప్పటికీ గతంలో అన్నాడీఎంకేలో పనిచేశారు. అతను అన్నాడీఎంకే యువజన విభాగం మాజీ సభ్యుడు, డిప్యూటీ సెక్రటరీ కూడా అయ్యాడు. కానీ ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన తర్వాత ఆయనను అన్నాడీఎంకే నుంచి తొలగించారు.


Updated Date - 2022-06-15T18:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising