ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiktok: టిక్‌టాక్ భారత్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుందా అంటే.. కొత్తగా తెలిసిందేంటంటే..

ABN, First Publish Date - 2022-06-02T03:33:42+05:30

చైనాకు చెందిన Short-Form Mobile Videos App టిక్‌టాక్ భారత్‌లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులేస్తోంది. భారతీయ యూజర్ల వ్యక్తిగత డేటాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనాకు చెందిన Short-Form Mobile Videos App టిక్‌టాక్ భారత్‌లోకి మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చే దిశగా అడుగులేస్తోంది. భారతీయ యూజర్ల వ్యక్తిగత డేటాను చైనాకు చేరవేస్తోందనే ఆరోపణలతో, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోందన్న కారణంగా టిక్‌టాక్‌తో పాటు మరికొన్ని చైనా యాప్స్‌పై భారత్‌లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే.. టిక్‌టాక్ మాత్రం ఈసారి భారతీయ చట్టాలకు, మార్గదర్శకాలకు లోబడి భారత్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది. భారత్‌లో ఉన్న వ్యాపార భాగస్వాముల కోసం టిక్‌టాక్ అన్వేషిస్తున్నట్లు తెలిసింది. టిక్‌టాక్ మాతృ సంస్థ Bytedance ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. టిక్‌టాక్‌ను తిరిగి భారత్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు Hiranandani Groupతో Bytedance ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.



భారత్‌లో బడా రియల్ ఎస్టేట్ కంపెనీల్లో Hiranandani Group ఒకటి. ముంబై, బెంగళూరు, చెన్నైలో Hiranandani Groupకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులున్నాయి. అయితే.. భారత ప్రభుత్వం టిక్‌టాక్ రీ-ఎంట్రీకి అనుమతి ఇస్తుందో లేదో తెలియాల్సి ఉంది. టిక్‌టాక్ మళ్లీ భారతీయ యూజర్లకు దగ్గర కావాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపాడు. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని టిక్‌టాక్ స్టోర్ చేసుకున్నట్లు గుర్తించి ఈ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది.

Updated Date - 2022-06-02T03:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising