ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుతతో రైతుల ఢీ..!

ABN, First Publish Date - 2022-01-25T16:31:30+05:30

ఈరోడ్‌ జిల్లా నంబియూరు వద్ద సజ్జ చేలో చొరబడిన చిరుతపులి రైతులపై దాడి చేసింది. దానిని తరిమేందుకు ముగ్గురు రైతులు తలపడ్డారు. అయితే ఆ రైతులపై దాడి చేసిన చిరుత స్థానికులు రావటంతో పారిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                        - తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలు


చెన్నై: ఈరోడ్‌ జిల్లా నంబియూరు వద్ద సజ్జ చేలో చొరబడిన చిరుతపులి రైతులపై దాడి చేసింది. దానిని తరిమేందుకు ముగ్గురు రైతులు తలపడ్డారు. అయితే ఆ రైతులపై దాడి చేసిన చిరుత స్థానికులు రావటంతో పారిపోయింది. సోమవారం ఉదయం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నంబియూరు సమీపం పాప్పాం కుళంలో మారన్‌ (62), వరదరాజ్‌ (61), వెంకటాచలం (48) అనే రైతులు నివశిస్తున్నారు. సోమవారం ఉదయం మారన్‌ తన సజ్జ చేను పరిశీలించేం దుకు వెళ్ళాడు. ఆ చేలో దాగి ఉన్న చిరుతపులి హఠాత్తుగా మారన్‌పై దాడికి దిగింది. ఆ చిరుతను పట్టుకుని మారన్‌ తరిమికొట్టేందుకు ప్రయత్నించాడు. అతడి కేకలు విని వరదరాజ్‌, వెంకటాచలం కూడా పరుగెత్తు కెళ్ళారు. ముగ్గురు కలిసి ఆ చిరుతతో పోరుకు దిగారు. కాని చిరుతపులి ముగ్గురిపై పంజా విసిరింది. కాగా చిరుత దాడి విషయం తెలుసుకుని స్థానికులంతా అక్కడికి కేకలు వేసుకుంటూ రావడంతో చిరుతపులి  పారి పోయింది. ఈ విషయం తెలిసిన అటవీ శాఖాధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.. ముగ్గురిపై చిరుత దాడి చేసినట్టు నిర్ధారించి తీవ్రంగా గాయపడిన వారిని అవినాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు ఆ సజ్జ చేనులో ఉన్న చిరుతపులి కాలి అడుగు జాడలను బట్టి అది ఏ దిశగా వెళ్ళిందో చూస్తూవెళ్లినా కానీ దానిజాడ  కనుగొనలేకపోయారు. చివరకు చిరుతపులిని పట్టుకునేందుకు సజ్జ చేలలో బోన్లు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు  ప్రారంభించారు.


Updated Date - 2022-01-25T16:31:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising