ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో మునిగి నవదంపతుల సహా ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-10-17T16:35:14+05:30

తేని జిల్లా బోడి సమీపంలో వివాహ విందు కోసం మేనమామ ఇంటికి వచ్చిన నూతన దంపతులు సహా ముగ్గురు చెరువులో స్నానాలకు వెళ్లి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ప్యారీస్‌: తేని జిల్లా బోడి సమీపంలో వివాహ విందు కోసం మేనమామ ఇంటికి వచ్చిన నూతన దంపతులు సహా ముగ్గురు చెరువులో స్నానాలకు వెళ్లి మృతిచెందిన సంఘటన విషాదానికి దారితీసింది. బోడికి చెందిన మాజీ సైనికుడు కుమారుడు సంజయ్‌ (24) లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన మేనమామ తేనికి చెందిన రాజాకు గత నెల రోజుల క్రితం కోయంబత్తూర్‌కు చెందిన కావ్యతో వివాహం జరిగింది. వివాహానికి హాజరుకాలేకపోయిన సంజయ్‌ ఇటీవల మేనమామ ఇంట్లో జరిగిన విందులో పాల్గొనేందుకు లండన్‌ నుంచి వచ్చారు. ఆదివారం ఉదయం బోడి సమీపంలోని కొంబై చెరువులో స్నానం చేసేందుకు నూతన దంపతులు, పిన్ని కుమారుడు ప్రణవ్‌, సంజయ్‌ వెళ్లారు. వారు మెట్లు దిగుతూ జారి నీటిలో మునిగిపోయారు. ఈ దుర్ఘటనలో చిన్నారి ప్రణవ్‌ స్వల్పగాయాలతో బయటపడగా, మిగతా ముగ్గురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతంలో గాలించి ముగ్గురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. వివాహం జరిగిన నెలరోజులే గడచిన నూతన దంపతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

Updated Date - 2022-10-17T16:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising