ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో మూడు రోజులు సెగలే...

ABN, First Publish Date - 2022-05-01T13:09:26+05:30

రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 5

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8.30 నుంచి ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 5 గంటల వరకు తగ్గకపోవడంతో ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలో మార్చి రెండవ వారం నుంచే ఎండల తీవ్రత పెరగ్గా, ఏప్రిల్‌ రెండవ వారం నుంచి మరింత ఉధృతమయ్యాయి. శనివారం 10 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల ఫారన్‌హీట్‌ (37 డిగ్రీల సెల్సియస్‌) దాటాయి. కరూర్‌, పరమత్తి వేలూరు, తిరుత్తణి, తిరుచ్చిలలో 41 డిగ్రీలు సేలం, ఈరోడ్‌లలో 40, మదురై, ధర్మపురిలో 39, పాళయంకోటలో 38, తంజావూరు, నామక్కల్‌, కడలూరు, కోయంబత్తూర్‌, చెన్నై మీనంబాక్కంలో 37 డిగ్రీలు, నుంగంబాక్కం, పుదుచ్చేరిలో 36, తూత్తుకుడిలో 34, కొడైకెనాల్‌లో 21 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే సమయంలో రానున్న మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశముందని వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5వ తేదీ అగ్నినక్షత్రం ప్రారంభం కానుండటంతో పగటి ఉష్ణోగ్రలు మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు ఎక్కువగా బయట తిరగవద్దని, శీతలపానీయాలు, మజ్జిగతో పాటు మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యనిపుణులు సలహా ఇస్తున్నారు.

Updated Date - 2022-05-01T13:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising