ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గాయాలు

ABN, First Publish Date - 2022-03-21T18:19:21+05:30

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు సోమవారం జరిపిన ఎదురు కాల్పుల్లో పారామిలటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన ముగ్గురు జవాన్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అటవీ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు సోమవారం జరిపిన ఎదురు కాల్పుల్లో పారామిలటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)కి చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.జాగర్గొండ పోలీస్ స్టేషన్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీపీఆర్‌ఎఫ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్మగుండ క్యాంపు సమీపంలో కాల్పులు జరిగినట్లు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ తెలిపారు. గాయపడిన జవాన్ల పరిస్థితి నిలకడగా ఉందని ఐజీ తెలిపారు.గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలిస్తామని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చెప్పారు. కాల్పుల అనంతరం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో పారామిలటరీ దళానికి చెందిన ఒక అధికారి మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు.


Updated Date - 2022-03-21T18:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising