ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెయ్యేళ్ల నాటి ప్రాచీన శిలాఫలకాల లభ్యం

ABN, First Publish Date - 2022-01-23T15:19:49+05:30

తిరుపత్తూర్‌ సమీపంలో వెయ్యేళ్ల నాటి పురాతన చండీకేశ్వరుడి ఆకారం కలిగిన శిలాఫలకంతో పాటు రెండు శిలాఫ లకాలు బయల్పడ్డాయి. ఈ విషయమై తిరుపత్తూర్‌ తూయనెంజై కళాశాల తమిళ శాఖ అసిస్టెంట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై): తిరుపత్తూర్‌ సమీపంలో వెయ్యేళ్ల నాటి పురాతన చండీకేశ్వరుడి ఆకారం కలిగిన శిలాఫలకంతో పాటు రెండు శిలాఫ లకాలు బయల్పడ్డాయి. ఈ విషయమై తిరుపత్తూర్‌ తూయనెంజై కళాశాల తమిళ శాఖ అసిస్టెంట్‌ లెక్చరర్‌ ప్రభు మాట్లాడుతూ, తిరుపత్తూర్‌ జిల్లా కురిసిలా పట్టు ప్రాంతంలో రహదారి పనులు జరుగుతున్న సమయంలో ఈ శిలాఫలకాలు వెలుగుచూశాయన్నారు. ఓ శిలాఫలకం 2.5 అడుగుల ఎత్తు, 1.25 అడుగుల వెడల్పుతో ఉందన్నారు. దానిపై క్రీ.పూ 10వ శతాబ్దానికి చెందిన చోళుల కాలానికి చెందిన చండీకేశ్వరుడి ఆకారం చెక్కబడి ఉండటాన్ని గుర్తించామన్నారు. అలాగే, 5.5 అడుగుల ఎత్తు, 3.5 అడుగుల వెడల్పుతో ఉన్న శిలాఫలకంలో ఓ వీరుడు ఒక చేతితో విల్లు, కుడి చేతితో బాణం పట్టుకున్న భంగిమలో చిత్రీకరించి ఉందని, యుద్ధంలో మృతిచెందిన వీరుడికి స్మారకంగా దీనిని రూపొందించి ఉండొచ్చని తెలిపారు. వీటిని ఆ ప్రాంతంలోని ద్రౌపతి అమ్మన్‌ ఆలయంలో ఉంచినట్లు ప్రభు తెలిపారు. ఆయన వెంట సమాజ సేవకుడు రాధాకృష్ణన్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-23T15:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising