ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uttarakhand:లోయలో పడిన బస్సు...32మంది మృతి, 20 మందికి గాయాలు

ABN, First Publish Date - 2022-10-05T13:50:28+05:30

ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట్‌ద్వార్‌(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. 55 మంది ప్రయాణికులతో వస్తున్న బస్సు పౌరీ జిల్లాలోని ధూమకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిమ్ది గ్రామ సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. బస్సు లోతైన లోయలో(deep gorge) పడిపోవడంతో 32 మంది దుర్మరణం చెందారు.(bus falls) ఈ ప్రమాద ఘటనలో మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారని ఉత్తరాఖండ్ పోలీసులు చెప్పారు. 500మీటర్ల లోతైన లోయలో బస్సు పడటంతో సంఘటన స్థలానికి స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఎన్సీఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.హరిద్వార్ జిల్లాలోని లాల్‌ధాంగ్ నుంచి పౌరీ జిల్లా బీర్‌ఖాల్ బ్లాక్‌కు బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో పెళ్లి కోసం వచ్చిన జనం ఉన్నారని పోలీసులు చెప్పారు. 


ప్రమాద విషయం తెలిసిన వెంటనే దుమ్‌కోట్ పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రానికి చేరుకున్నారు.ప్రమాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌(Defence Minister Rajnath Singh) సంతాపం తెలిపారు. ‘‘ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం హృదయ విదారకంగా ఉంది. ఈ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ తీరని లోటును భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలి. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.’’అని రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్‌లో(tweet) పేర్కొన్నారు. 




Updated Date - 2022-10-05T13:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising