ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Thailand: థాయ్‌లాండ్‌లో అమానుష ఘటన.. సామూహిక కాల్పుల్లో 34 మంది మృతి

ABN, First Publish Date - 2022-10-06T21:02:06+05:30

థాయ్‌లాండ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ డే కేర్ సెంటర్‌లో గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 34 మందిలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

థాయ్‌లాండ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ డే కేర్ సెంటర్‌లో ఓ వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన 34 మందిలో 22 మంది చిన్నారులే కావడం శోచనీయం. ఈ కాల్పులు తర్వాత తనను తాను కాల్చుకుని ఆ 34 ఏళ్ల వ్యక్తి కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ కాల్పులకు తెగబడ్డ వ్యక్తి ఒక మాజీ పోలీసు అని తెలిసింది. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తి తన భార్యాబిడ్డ ప్రాణం కూడా తీయడం అతని క్రూర మనస్తత్వానికి అద్దం పట్టింది. గతేడాదే పోలీసు విధుల నుంచి అతను తప్పుకున్నట్లు తెలిసింది. ఈ కాల్పుల్లో మరో 12 మంది కూడా గాయపడ్డారు. థాయ్‌లాండ్‌లోని Nongbua Lamphu ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ తుపాకీ కలిగిన వ్యక్తి పేరు Panya Khamrab.


 

డ్రగ్స్ తీసుకుంటూ, మత్తుకు బానిసయ్యాడనే కారణంగా పోలీసు ఉద్యోగం నుంచి అతనిని తొలగించినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో మరో విషాదం కూడా చోటుచేసుకుంది. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఎనిమిది నెలల గర్భిణి కూడా ఉంది. ఆమె ఆ డే కేర్ సెంటర్‌లో టీచర్‌గా చేస్తోంది. తొలుత టపాసుల మోత అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఇలాంటి మారణహోమం జరగడంతో థాయ్‌లాండ్ ఉలిక్కిపడింది.

Updated Date - 2022-10-06T21:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising