ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీకి బై బై!

ABN, First Publish Date - 2022-01-14T08:25:32+05:30

యూపీలో బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఓబీసీ నేత ధరం సింగ్‌ సైనీ గురువారం యోగీ క్యాబినెట్‌కు గుడ్‌బై చెప్పారు. అలాగే, షికోహాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ముఖేశ్‌ వర్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ సర్కారు ఓబీసీలు, దళితులు, రైతులకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యోగి క్యాబినెట్‌ నుంచి మూడో మంత్రి ధరంసింగ్‌ రాజీనామా

172 మందితో బీజేపీ జాబితా 

125 మందిని ప్రకటించిన కాంగ్రెస్‌ 


లఖ్‌నవూ, జనవరి 13: యూపీలో బీజేపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఓబీసీ నేత ధరం సింగ్‌ సైనీ గురువారం యోగీ క్యాబినెట్‌కు గుడ్‌బై చెప్పారు. అలాగే, షికోహాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ముఖేశ్‌ వర్మ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీజేపీ సర్కారు ఓబీసీలు, దళితులు, రైతులకు అన్యాయం చేసిందని వీరిద్దరూ ఆరోపించడం విశే షం. ఎస్పీలో చేరిన వీరిద్దరూ మాజీ మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్యకు సన్నిహితులు. దాంతో 3 రోజుల్లోనే ముగ్గురు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఝలక్‌ ఇచ్చి సమాజ్‌వాదీ తీర్థం పుచ్చుకున్నట్లు అయింది. ధరం సింగ్‌ సైనీ యోగి క్యాబినెట్‌లో స్వతంత్ర హోదాలో ఆయుష్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. సైనీతో కలిసి ఉన్న ఫొటోను ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ గురువారం ట్విటర్లో పోస్ట్‌ చేశారు. మంగళ, బుధవారాల్లో ఓబీసీ నేతలు ప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌లు యోగి క్యాబినెట్‌ నుంచి రాజీనామా చేసినప్పు డు కూడా ఆయన ట్విటర్లో ఇలాగే పెట్టారు. ఎస్పీలోకి సైనీకి స్వాగతం పలుకుతున్నానన్నారు. ఇక, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌కు సైనీ తన రాజీనామా లేఖను పంపారు. దళిత, వెనకబడిన వర్గా ల ప్రజా ప్రతినిధులను యోగి తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.


ప్రసాద్‌ మౌర్య, చౌహాన్‌ కూడా తమ రాజీనామా లేఖ ల్లో ఇవే ఆరోపణలు చేశారు. దళితు లు, వెనకబడిన వర్గాలకు బీజేపీలో గౌరవం లేదని, అందుకే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని షికోహాబాద్‌ ఎమ్మెల్యే, ఓబీసీ నేత ముఖేశ్‌ వర్మ కూడా పే ర్కొనడం విశేషం. మౌర్య నాయకత్వంలో సామాజిక న్యాయ సాధనకు పోరాటం చేస్తానన్నారు. ముగ్గురు మంత్రులు తమ రాజీనామా లేఖల్లో ఏయే పదాలు రాశారో అవే పదాలను ముఖేశ్‌వర్మ కూడా పేర్కొనడం గమనార్హం. ప్రసాద్‌ మౌర్యను తమ నాయకుడిగా అభివర్ణించారు. కాగా, షహరాన్‌పూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నరేశ్‌ సైనీ, ఫిరోజాబాద్‌ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్‌, ఎస్పీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ధరంపాల్‌ సింగ్‌లు బీజేపీలో చేరారు.


20 వరకూ రోజూ రాజీనామాలే: సైనీ

మరో మంత్రి, ఇద్దరు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు రానున్నారని, ఈ నెల 20వ తేదీ వరకూ రోజూ రాజీనామా లు కొనసాగుతాయని యోగి క్యాబినెట్‌కు గుడ్‌బై చెప్పిన మంత్రి ధరంసింగ్‌ సైనీ అన్నారు. ‘‘ఆర్‌ఎ్‌సఎస్‌ కోబ్రా. బీజేపీ పాము. నేను ముంగిస. యూపీ నుంచి ఆ రెండింటినీ సాగనంపే వరకూ నిద్రపోను’’ అని ఓబీసీ నేత ప్రసాద్‌ మౌర్య ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-01-14T08:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising