ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాళ్లు Taj Mahal కింద మోదీ degree ఉందేమోనని వెతుకుతున్నారు: Owaisi

ABN, First Publish Date - 2022-05-29T21:55:43+05:30

తాజ్‌మహాల్‌లోని గదులపై చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు దీనిపై ఎక్కువగా చర్చిస్తున్నారు. నిజానికి తాజ్‌మహాల్‌కు బీజేపీ నేతలు వెళ్లింది మోదీ డిగ్రీ ధ్రువపత్రం వెతకడానికి. మోదీ డిగ్రీ చేసినట్లు ఆధారాలు లేవు. అలాగే తాజ్‌మహాల్ గదుల్లో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కూడా ఆధారాలు లేవు. రెండింటి గురించి వెతికి ప్రయోజనం లేదు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తాజ్‌మహాల్(Taj Mahal) వివాదంపై హైదరాబాద్ ఎంపీ(Hyderabad MP), ఏఐఎంఐఎం(AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా స్పందించారు. తాజ్‌మహాల్ కింద మోదీ డిగ్రీ కోసం భారతీయ జనతా పార్టీ(BJP) నేతలు వెతుకుతున్నారని ఆయన విమర్శించారు. మహారాష్ట్ర(Maharashtra)లోని భివండి(Bhiwandi)లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతే కాకుండా మొఘలుల లాగే ఈ దేశానికి చాలా మంది వచ్చారని, వాస్తవానికి ఈ దేశం ద్రవిడులు, ఆదివాసీలదని ఓవైసీ వ్యాఖ్యానించడం గమనార్హం.


‘‘తాజ్‌మహాల్‌లోని గదులపై చర్చ జరుగుతోంది. బీజేపీ నేతలు దీనిపై ఎక్కువగా చర్చిస్తున్నారు. నిజానికి తాజ్‌మహాల్‌కు బీజేపీ నేతలు వెళ్లింది మోదీ డిగ్రీ ధ్రువపత్రం వెతకడానికి. మోదీ డిగ్రీ చేసినట్లు ఆధారాలు లేవు. అలాగే తాజ్‌మహాల్ గదుల్లో బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కూడా ఆధారాలు లేవు. రెండింటి గురించి వెతికి ప్రయోజనం లేదు’’ అని ఓవైసీ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘భారతదేశం నాది కాదు, థాకరేది కాదు, మోదీ-అమిత్‌షాలది కాదు. ఈ దేశం ఎవరిది అని మాట్లాడాల్సి వస్తే.. ద్రవిడులు, ఆదివాసీలదని చెప్పాల్సి ఉంటుంది. మొఘలుల తర్వాత బీజేపీ-ఆర్ఎస్ఎస్(BJP-RSS) వచ్చాయి. వాస్తవం ఏంటంటే.. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుంచి వచ్చిన వలసల అనంతరం ఈ దేశం అనేది ఏర్పడింది’’ అని అన్నారు.

Updated Date - 2022-05-29T21:55:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising