ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలాంటి అజెండా లేదు

ABN, First Publish Date - 2022-05-22T07:35:45+05:30

భారతీయ భాషలన్నీ భారతీయ ఆత్మ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ ప్రశంసించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోదీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా 

కన్నడ నటుడు సుదీప్‌ 

న్యూఢిల్లీ, మే 21: భారతీయ భాషలన్నీ భారతీయ ఆత్మ అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడాన్ని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ ప్రశంసించారు. హిందీ జాతీయ భాష కాదంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించానని, దీని వెనుక ఎలాంటి అజెండా లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ తమ మాతృభాషపై గౌరవం ఉంటుందని, తాను ఆ ఉద్దేశంతోనే మాట్లాడానన్నారు. ‘‘నేను సినిమా రంగం నుంచి వచ్చాను. కన్నడకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ రోజు అన్ని మాతృభాషలను గౌరవిస్తున్నారు. సినిమాలు అన్ని భాషల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లాలి. దక్షిణాది లేక హిందీ పరిశ్రమ నుంచి వచ్చినా, పాన్‌ ఇండియా అనే పిలవాలి. అన్ని భాషలు పూజనీయం అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా. మోదీని కేవలం రాజకీయ నాయకుడిగా మనం చూడరాదు. ఓ నాయకుడిగా గౌరవించాలి’’ అని సుదీప్‌ అన్నారు. కాగా గత నెలలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌.. హిందీ జాతీయ భాష అంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై సుదీప్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. హిందీ ఇక జాతీయ భాషగా ఉండదని సుదీప్‌ చేసిన వ్యాఖ్యలకు కర్ణాటకలో ప్రముఖ రాజకీయ నేతలు మద్దతు పలికారు.

Updated Date - 2022-05-22T07:35:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising