ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య

ABN, First Publish Date - 2022-02-26T18:49:00+05:30

రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : రష్యాతో భారత్, అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణ, భద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. అటువంటి సంబంధాలు రష్యాతో తమకు లేవని తెలిపింది. నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించేందుకు తమ పలుకుబడిని ఉపయోగించాలని రష్యాతో సంబంధాలున్న ప్రతి దేశాన్ని తాము కోరామని తెలిపింది. 


అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకర్లతో  మాట్లాడుతూ, తమకు భారత దేశంతో చాలా ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. భారత్-అమెరికా అత్యంత ముఖ్యమైన విలువలను పంచుకుంటున్నాయని తెలిపారు. అయితే రష్యాతో భారత దేశానికి సత్సంబంధాలు ఉన్నట్లు తమకు తెలుసునన్నారు. ఆ సంబంధాలు అమెరికా-రష్యా మధ్య ఉన్న సంబంధాల కన్నా భిన్నమైనవని తెలిపారు. 


‘‘రష్యాతో భారత దేశానికి సంబంధాలున్నాయి, అవి కచ్చితంగా మాకు లేవు. రక్షణ, భద్రత రంగం సహా వివిధ రంగాల్లో భారత్-రష్యా మధ్య సంబంధాలున్నాయి. అవి మాకు లేవు. పలుకుబడిగల దేశాలన్నీ తమ పలుకుబడిని నిర్మాణాత్మక పద్ధతిలో ఉపయోగించాలని అన్ని దేశాలను కోరాం’’ అని నెడ్ ప్రైస్ చెప్పారు. 


Updated Date - 2022-02-26T18:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising