ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gun Control Lawకు జో బైడెన్ ఆమోదం

ABN, First Publish Date - 2022-06-26T01:49:06+05:30

తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన గన్ వయలెన్స్ బిల్లుపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన గన్ వయలెన్స్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) శనివారం సంతకం చేశారు. ఈ బిల్లును గురువారం సెనేట్ (Senate), శుక్రవారం ప్రతినిధుల సభ (House) ఆమోదించాయి. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత బైడెన్ వైట్ హౌస్‌లో మాట్లాడుతూ, ‘‘ప్రాణాలకు రక్షణ లభిస్తుంది’’ అన్నారు. 


యూరోప్ (Europe) పర్యటనకు వాషింగ్టన్ (Washington) నుంచి బయల్దేరడానికి ముందు బైడెన్ ఈ బిల్లును ఆమోదించారు. అనంతరం వైట్ హౌస్‌ (White House)లో మాట్లాడుతూ, తుపాకీ సంస్కృతి (Gun Culture) వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రస్తావించారు. ఏదో ఒకటి చేయాలనేది వారి సందేశమని తెలిపారు. ఆ పనిని తాము ఈ రోజు చేశామన్నారు. ‘‘ప్రాణాలకు రక్షణ లభిస్తుంది’’ అన్నారు. చేయవలసింది ఇంకా చాలా ఉందని తనకు తెలుసునని, అయితే తాను వదిలిపెట్టబోనని చెప్పారు. ఇది చాలా చరిత్రాత్మక దినమని తెలిపారు. చట్ట సభల సభ్యులు, తుపాకీ హింస ప్రభావిత కుటుంబాల కోసం జూలై 11న ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జో బైడెన్ చెప్పారు. 


ఈ చట్టంలో ఏముంది?

తుపాకీ కొనాలనుకునే యువత నేపథ్యాన్ని అత్యంత క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఈ చట్టం చెప్తోంది. గృహ హింసకు పాల్పడేవారికి తుపాకీలను దూరంగా ఉంచాలని ఈ చట్టం చెప్తోంది. అదేవిధంగా ప్రమాదకారులుగా నిర్థరణ అయిన వ్యక్తుల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్రాలు తగిన చట్టాలను తీసుకురావడానికి అవకాశం కల్పిస్తోంది. మానసిక ఆరోగ్య పథకాలను అమలు చేయడానికి, సామూహిక నరమేధం జరిగిన పాఠశాలలకు సహాయపడటానికి అవకాశం కల్పిస్తోంది. ప్రాణాపాయం కలిగించే ఆయుధాలపై నిషేధం విధించాలని డెమొక్రాట్లు చాలా కాలం నుంచి కోరుతున్నప్పటికీ అటువంటి కఠినమైన ఆంక్షలు ఈ చట్టంలో లేవు. 


న్యూయార్క్, టెక్సాస్‌లలో మాస్ షూటింగ్స్ జరగడంతో కంగ్రెషనల్ రిపబ్లికన్స్, డెమొక్రాట్లు కొన్ని రోజులపాటు చర్చలు జరిపి, ఓ రాజీకి వచ్చారు. అనంతరం ఈ చట్టాన్ని ఆమోదించారు. 


Updated Date - 2022-06-26T01:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising