మార్చికల్లా కొత్త పార్లమెంటు భవనం సిద్ధం!
ABN, First Publish Date - 2022-12-31T04:52:08+05:30
వచ్చే ఏడాది మార్చికల్లా పార్లమెంటు కొత్త భవనం అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయని, ఫిబ్రవరికల్లా పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా తెలిపాయి. పార్లమెంటు తొలి సెషన్‌ను వచ్చే నెల 30 లేదా 31న మొదలుపెడతారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 30: వచ్చే ఏడాది మార్చికల్లా పార్లమెంటు కొత్త భవనం అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయని, ఫిబ్రవరికల్లా పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా తెలిపాయి. పార్లమెంటు తొలి సెషన్‌ను వచ్చే నెల 30 లేదా 31న మొదలుపెడతారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రెండో సెషన్‌ను సాధారణంగా మార్చి రెండోవారంలో ప్రారంభిస్తారు. ఇది మే వరకూ నడుస్తుంది. రెండవ సెషన్‌ను కొత్త భవనంలోనే నిర్వహిస్తామని పార్లమెంటు వర్గాలు తెలిపాయి.
Updated Date - 2022-12-31T04:52:09+05:30 IST