ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దగ్గు మందులు చంపేశాయ్‌..!

ABN, First Publish Date - 2022-10-07T09:10:46+05:30

భారత్‌లోని ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిర్‌పలు పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి

భారత్‌లో తయారైన నాలుగు సిరప్‌లే కారణం

మెయిడెన్‌ ఫార్మాస్యుటికల్స్‌లో మందుల తయారీ

వాటిలో ప్రాణాంతక డైథిలీన్‌ గ్లైకాల్‌, ఇథిలీన్‌ గ్లైకాల్‌

కిడ్నీలు పాడై ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు

ప్రపంచ దేశాలను హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో

అప్రమత్తమైన భారత్‌.. ‘మెయిడెన్‌’పై విచారణ

ఆ 4 సిరప్‌లు భారత్‌లో విక్రయించలేదు: కేంద్రం


యునైటెడ్‌ నేషన్స్‌/జెనీవా, న్యూఢిల్లీ, అక్టోబరు 6: భారత్‌లోని ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిర్‌పలు పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యాయి. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించింది. భారత్‌లోని మెయిడెన్‌ ఫార్మాసూటికల్‌ కంపెనీ తయారు చేసిన నాలుగు రకాల సిర్‌పల కారణంగానే ఈ మరణాలు సంభవించాయని ప్రకటించింది. ఈ సిర్‌పల వాడకం వల్ల కిడ్నీలు దెబ్బతిని వారు చనిపోయారని పేర్కొంది. ఈ మందుల వాడకంపై ఇతర దేశాలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. చిన్నారుల మరణాలపై డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ అధనోమ్‌ మాట్లాడుతూ.. ‘దగ్గు, జలుబుకి వాడే ఈ మందులను భారత్‌లోని మెయిడెన్‌ ఫార్మా కంపెనీ తయారు చేసింది. చిన్నారుల మరణం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ వ్యవహారంపై ఆ సంస్థతోపాటు భారత్‌లోని ఔషధ నియంత్రణ సంస్థతో కలిపి డబ్ల్యూహెచ్‌వో విచారణ నిర్వహిస్తోంది’ అని చెప్పారు. హరియాణాలోని మెయిడెన్‌ ఫార్మా సంస్థ దగ్గు, జలుబు కోసం ప్రొమెథాజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మాలిన్‌ బేబీ కఫ్‌ సిరప్‌, మెకాఫ్‌ బేబీ కఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిర్‌పలను తయారు చేసిందని, ఈ రోజువరకు వాటి భద్రత, నాణ్యతపై తమకు హామీ ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. నాలుగు హానికరమైన సిర్‌పల వాడకం కారణంగా చిన్నారులు చనిపోయినట్టు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది. ల్యాబ్‌లో ఆ మందుల శాంపిళ్లను పరీక్షించినప్పుడు.. వాటిలో మోతాదుకు మించి డైథిలీన్‌ గ్లైకాల్‌, ఇథిలీన్‌ గ్లైకాల్‌ కలిసినట్టు గుర్తించామని వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రకటన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభించింది.


ఆ శాంపిళ్లు కోల్‌కతాలోని సీడీఎల్‌కు..

మెయిడెన్‌ సంస్థ తయారు చేసిన సిర్‌పల శాంపిళ్లను కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ (సీడీఎల్‌)కి పంపినట్టు హరియాణ ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ గురువారం వెల్లడించారు. సీడీఎల్‌ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ఈ కంపెనీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Updated Date - 2022-10-07T09:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising