ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులను పట్టించుకోండి ప్లీజ్‌ !

ABN, First Publish Date - 2022-07-01T13:27:02+05:30

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని కోరుతూ అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - ‘టెట్‌’ అభ్యర్థుల వినూత్న నిరసన


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 30: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని కోరుతూ అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. నుంగంబాక్కంలో మూడోరోజు గురువారం జరిగిన ఆందోళనలో పలువురు గుండు గీసుకొని, భిక్షాటన చేస్తూ, శవం చుట్టూ కూర్చొని ఏడుస్తున్నట్లు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టెట్‌ అభ్యర్థులు మాట్లాడుతూ... టెట్‌లో ఉత్తీర్ణులై ఎనిమిదేళ్లుగా ఉపాధ్యాయుల పోస్టుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. తాజాగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టిన ప్రభుత్వం, తాత్కాలిక పద్ధతిన నియమించుకొనేందుకు జిల్లా విద్యాధికారులకు అనుమతివ్వడం తమను దిగ్ర్భాంతికి గురిచేసిందన్నారు. టెట్‌ పూర్తిచేసిన సుమారు 80 వేల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, అయితే వారందరినీ పక్కనబెట్టి తాత్కాలిక ప్రాతిపదికన లోపాయికారీ నియామకాలు చేపట్టమేంటని నిలదీశారు. ప్రభుత్వం చేపట్టిన నియామకాల్లో టెట్‌ ఉత్తీర్ణులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-07-01T13:27:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising