ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెస్లాకు స్వాగతం.. కానీ ఒక షరతు : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ABN, First Publish Date - 2022-04-26T21:19:37+05:30

న్యూఢిల్లీ : అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కంపెనీ భారత్‌లో స్టోర్లు ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆహ్వానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కంపెనీ భారత్‌లో సేల్స్ స్టోర్లు ఏర్పాటుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ ఆహ్వానించారు. కానీ ఆయన ఓ షరతు విధించారు. టెస్లా భారత్‌లో కార్లు తయారు చేసుకోవచ్చు.. వాటిని ఎగుమతి చేసుకోవచ్చు. కానీ చైనాలో తయారైన కార్లను మాత్రం భారత్‌కు దిగుమతి చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. చైనాలో తయారైన కార్లను భారత్‌లో విక్రయించడం సబబుకాదన్నారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. 


భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లు విక్రయించాలని ఉవ్విళ్లూరుతున్న టెస్లా ఆ కలను నెరవేర్చుకోలేకపోతోంది. ఎలక్ట్రిక్ కార్ల దిగుమతులపై భారత్ అత్యధిక టారిఫ్‌లు విధిస్తోందని ఆరోపిస్తోంది. టారిఫ్‌లు తగ్గించమంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరుపుతున్న చర్చల్లో సానుకూల ఫలితం రావకపోవడంతో టెస్లా నిరాసక్తత వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రిక్ కార్లపై అత్యధిక టారిప్‌లు భారత్‌లోనే ఉన్నాయని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ప్రత్యక్షంగా గతంలో ఆరోపించారు. ముందుగా దిగుమతి చేసిన కార్లను విక్రయించి భారత్‌లో అమ్మకాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటామని, ఆ తర్వాత తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అంశామని పరిశీలిస్తామని టెస్లా చెబుతోంది. అయితే పెట్టుబడుల విషయంలో స్పష్టంగా తేల్చిచెప్పకపోవడంతోనే టెస్లా ప్రతిపాదనలపై భారత ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడంలేదనే విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-26T21:19:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising