ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ukraine నుంచి పారిపోతున్న ప్రజలకు టెస్లా కంపెనీ ఉచిత ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ ఆఫర్

ABN, First Publish Date - 2022-03-02T14:48:04+05:30

టెస్లా కార్ల తయారీ కంపెనీ ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న ప్రజలకు ఉచిత ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌ను అందిస్తామని ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కైవ్ (ఉక్రెయిన్): టెస్లా కార్ల తయారీ కంపెనీ ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న ప్రజలకు ఉచిత ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌ను అందిస్తామని ప్రకటించింది. రష్యా సైనిక దాడి నేపథ్యంలో ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా సహాయ పడేందుకు ఉచితంగా కార్లకు ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు టెస్లా తెలిపింది.టెస్లా, నాన్-టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ స్టేషన్లను సిద్ధం చేసినట్లు టెస్లా ఈమెయిల్‌లో ప్రకటించింది.ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లోని ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం  ట్ర్జెబౌనిస్కో (పోలాండ్), కోయిస్ (స్లోవేకియా), మిస్కోల్క్ (హంగేరి)లలో టెస్లా కార్ల తయారీ కంపెనీ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది.యుద్దాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు టెస్లా కంపెనీ విద్యుత్ వాహనాలకు ఉచితంగా ఛార్జింగ్ చేసుకునేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. 


Updated Date - 2022-03-02T14:48:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising