ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Punjab: ఎస్ఐ కారు కింద బాంబు, భారీ ఉగ్ర కుట్ర భగ్నం

ABN, First Publish Date - 2022-08-17T00:17:53+05:30

పంజాబ్‌ పోలీసులు సకాలంలో అప్రమత్తం కావడంతో భారీ పేలుడు ఘటన తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్‌ పోలీసులు సకాలంలో అప్రమత్తం కావడంతో భారీ పేలుడు ఘటన తప్పింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ దిల్ బాగ్ సింగ్ (Dilbag Singh) కారు (SUV) కింద కొందరు అగంతకులు అమర్చిన ఐఈడీ (IED)ని బాంబ్ స్క్వాడ్ సకాలంలో తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం కారును కడిపేందుకు వచ్చిన వ్యక్తి ఐఈడీని గమనించి దిల్ బాగ్ సింగ్‌ను అప్రమత్తం చేయడం, ఆయన వెంటనే ఐఈడీని కనిపెట్టి బాంబు స్క్వాడ్‌ను రప్పించడంతో వెంటనే వారు దానిని నిర్వీర్వం (Defuse) చేశారు.


కాగా, దిల్ బాగ్ సింగ్ ఇంటి ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా ఇద్దరు అగంతకులు ఆయన కారు కింద గత రాత్రి భారీ పేలుడు సామర్థ్యం ఉన్న బాంబును అమర్చినట్టు గుర్తించారు. బైక్‌పై వచ్చిన అగంతకులు బాంబు అమర్చిన వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. వీరు తెల్లడి కుర్తాలు ధరించి, ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో దిల్ బాగ్ పనిచేస్తున్నందున ఆయనను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకుని ఉండవచ్చనే  కోణం నుంచి పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సువ్ ఇంజన్ స్టార్ చేయగానే బాంబు పేలేలా అగంతకులు దానిని అమర్చినట్టు వారు చెబుతున్నారు. ఐఎస్ఎస్ఎస్ టెర్రర్ మాడ్యూల్‌ను రెండు రోజుల క్రితమే పంజాబ్ పోలీసులు భగ్నం చేసిన క్రమంలో తాజా ఘటన చోసుకోవడం సంచలనమైంది.

Updated Date - 2022-08-17T00:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising